Saturday, 21 March 2020

ఆస్పత్రిలో కనికా కపూర్ తీరుపై డాక్టర్ల సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా వైరస్ వచ్చింది. లండన్ నుంచి వచ్చిన ఈ సింగర్ తన వెంట కరోనా తెచ్చుకుంది. లండన్ నుంచి వచ్చిన ఆమె ఎయిర్ పోర్ట్ లో తన ట్రావెల్ హిస్టరీ దాచిపెట్టి ఫ్యామిలీ పార్టీలో హాజరైంది. దీంతో ఆమెను లక్నో నగరంలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ లోని ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్పత్రిలో తీరుపై ఆస్పత్రి వర్గాలు మండిపడుతున్నాయి. ఆస్పత్రిలో కనికా కపూర్ ఓ స్టార్ లా కాకుండా రోగిలా ప్రవర్తించాలని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ డైరెక్టరు సూచించారు. కరోనా వైరస్ తో చికిత్స పొందుతున్న కనికాకపూర్ ను ప్రత్యేక ఏసీ ఐసోలేషన్ గదిలో ఉంచినట్లుగా ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఆమెకు అటాచ్‌డ్ టాయ్‌లెట్, టీవీ, వెంటిలేటర్ సౌకర్యాలు కల్పించామన్నారు. అంతేకాకుండా కనికాకు ఆసుపత్రి కిచెన్ నుంచి గ్లూటెన్ ఫ్రీ డైట్ అందిస్తున్నామని ఆసుపత్రి డైరెక్టరు చెప్పారు. కనికాకపూర్ చికిత్స విషయంలో తాము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కానీ... ఆమె మాత్రం మొదట స్టార్ లా కాకుండా రోగిలా ప్రవర్తించాలని మెడికల్ డైరెక్టరు సలహా ఇచ్చారు. లండన్ నుంచి తిరిగి వచ్చాక కనిక కపూర్ ఓ పార్టీకి కూడా వెళ్లింది. దాదాపు వంద మంది ఆ వేడుకలో పాల్గన్నారు. అందులో పార్లమెంట్ ఎంపీ కూడా ఉన్నారు. ఆ ఎంపీ రాష్ట్రపతి భవన్ వెళ్ళాడు. అక్కడ రాష్ట్రపతితో పాటు అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్న అల్పాహార విందుకు హాజరయ్యారు. అలాగే ఆ పార్టీకి వెళ్లిన కొందరు నేతలు రీసెంట్ గా యూపీ కాబినెట్ మీటింగ్ లో పాల్గొన్నారు. మాజీ సీఎం వసుంధర రాజేతోపాటు ఆయన కుమారుడు దుష్యంత్ సింగ్, పలువురు ఎంపీలు హాజరుకావడంతో కరోనా భయంతో వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. బాలీవుడ్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు కనికా కపూర్‌దే. దీంతో సినీ ఇండస్ట్రీలో ఆందోళనలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఆమె తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UbENXf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...