Thursday, 12 March 2020

‘ఈ మాయ పేరేమిటో’ సాంగ్.. మాయ చేసిన సిద్ శ్రీరామ్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. ఉగాది కానుకగా మార్చి 25న ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘ఈ మాయ పేరేమిటో’ పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రచించారు. ప్రస్తుతం సిద్ శ్రీరామ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. తెలుగులో ఆయన ఏ పాట పాడినా అది సెన్సేషన్ అయిపోతోంది. ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘సామజవరగమన’, ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’లో ‘నీలి నీలి ఆకాశం’, ‘రాహు’లో ‘ఏమో ఏమో’.. ఇలా ప్రతి పాట అద్భుతమే. తాజాగా ఆ స్వరం నుంచి జాలువారిన మరో అందమైన పాట ‘ఈ మాయ పేరేమిటో’. అనూప్ రూబెన్స్ - సిద్ శ్రీరామ్ కాంబోలో వచ్చిన మరో మంచి సాంగ్ ఇది. నీలి నీలి ఆకాశం పాటను కూడా అనూప్ రూబెన్సే స్వరపరిచారు. కిట్టు సాహిత్యం కూడా చాలా సరళంగా, అందరికీ అర్థమయ్యేలా ఉంది. Also Read: కాగా, ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. నంద్యాల రవి మాటలు రాశారు. ఐ.ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్‌ పూడి ఎడిటర్. శేఖర్‌ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2vexl3S
v

No comments:

Post a Comment