Wednesday, 4 March 2020

సెక్స్ రాకెట్‌లో ఇరుక్కున్న ‘దొరబాబు’ నేను కాదు: నటుడు దావూద్

‘సార్.. సెక్స్ రాకెట్‌లో ఇరుక్కు్న్న నేను కాదు’ అంటూ మీడియా ముందుకు వచ్చి తలబాదుకున్నాడు ప్రముఖ ఆర్టిస్ట్ దావూద్. జబర్దస్త్ దొరబాబు, స్కిట్‌లో పనిచేసే పరదేశితో కలిసి విశాఖ‌లో సెక్స్ రాకెట్‌లో అడ్డంగా దొరికిపోయాడు. ఒక మహిళతో రాసలీలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోవడంతో తనను వదలేయాలని ఇద్దరూ పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. అయితే అచ్చం దొరబాబులా ఉండే ఆర్టిస్ట్ మరొకరు ఉన్నారు. అతని పేరు దావూద్. హైపర్ ఆది స్కిట్‌లో దావూద్, దొరబాబు కలిసి కవల సోదరులుగా స్కిట్‌ కూడా చేసారు. దాంతో సెక్స్ రాకెట్‌లో దొరికినది దొరబాబు అయితే.. చాలా మంది దావూద్‌కు ఫోన్ చేసి బండబూతులు తిడుతున్నారు. దాంతో అతను మీడియా ముందుకు వచ్చి దొరబాబు వేరు నేను వేరురా మొర్రో అని మొత్తుకున్నాడు. ‘అందరికీ నమస్కారం అండి. ఖైదీ నెం 1, డియర్ కామ్రేడ్, అర్జున్ సురవరం, భీష్మ తదితర సినిమాల్లో ఆర్టిస్ట్‌గా మంచి పాత్రల్లో నటించాను. నేను ఇందాకే దొరబాబుకు సంబంధించిన వీడియోలు చూసాను. నాకు ఆయనకు పోలికలు ఉన్నాయి. దాంతో ఆయన నేను ఒకరే అనుకుని నాకు చాలా మంది ఫోన్లు చేసి ఏంటిదంతా అని అడుగుతున్నారు. వారందరికీ ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నాను. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. దొరబాబు విషయంలో నాకు చాలా బాధ అనిపించింది. అలా ఎందుకు జరిగిందో నాకు తెలీదు.' READ ALSO: 'ఆయన విషయంలో ఏం జరగబోతోందో అని మీరు ఎలా ఎదురుచూస్తున్నారో నేను కూడా అలాగే ఎదురుచూస్తు్న్నారు. ఇద్దరం చూడటానికి ఒకేలా ఉండేవాళ్లం కాబట్టి ఫ్రెండ్లీగానే ఉండేవాళ్లం. ఇద్దరం కలిసి జబర్దస్త్‌లో ఒక్కటే స్కిట్ చేసాం. కానీ ఎప్పుడూ ఆయన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో నేను కలగజేసుకున్నది లేదు. ఇలాంటి చీప్ పబ్లిసిటీలు నేను చేయను. వాటిని ఎంకరేజ్ చేయను. ఏదేమైనా ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయింది. దొరబాబుకు ముందు ముందు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు’’ READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cxHpFQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...