Saturday, 21 March 2020

సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు తల్లి కన్నుమూత

పాపులర్ సినిమాటోగ్రాఫర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రత్నవేలు తల్లి జ్ఞానేశ్వరి రామన్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈమె ఈరోజు (మార్చ్ 21) తెల్లవారు జామున మరణించారు. ప్రస్తుతం ఆమె వయస్సు 80 ఏళ్లు. సరిలేరు నీకెవ్వరు, ఖైదీ నెం150, సైరా, రంగస్థలం, రోబో వంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు పనిచేసిన రత్నవేలుకు టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ స్టార్ హీరోలందరితో ప్రత్యేక అనుబంధం ఉంది. రత్నవేలు తల్లి మరణించడంతో పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. దర్శకుడు సుకుమార్ చిత్రాలకు రత్నవేలు తన తల్లి మరణ వార్తను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్‌‌ను షేర్ చేశారు. నా ఆనందం, నా ప్రేరణ, నా శక్తి అంతా నువ్వే అమ్మే. ఐ మిస్ యు అంటూ ట్వీట్ చేశారు రత్నవేలు. ప్రస్తుతం ఈయన శంకర్‌ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xaSsF4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...