ఇవాళ మెగా పవర్ స్టార్ . ఈ సందర్భంగా ప్రముఖులంతా మెగా హీరోకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చరణ్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇస్తానంటూ ముందురోజు జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించాడు. సరిగ్గా పదిగంటలకు తన గిఫ్ట్ ఇస్తానన్నాడు. అయితే తాజాగా తారక్ మరో ట్వీట్ చేశాడు. ‘ సారీ రామ్ చరణ్... నీ సర్ ఫ్రైజ్ గిఫ్ట్ దగ్గకు వెళ్లింది’కాస్త ఆలస్యం అవుతుంది అని తారక్ ట్వీట్ చేశాడు. తారక్ ట్వీట్ చూసిన చెర్రీ నిరాశ వ్యక్తంచేశాడు. ‘ ఏంటి నువ్వు ఆయన దగ్గరకు వెళ్లావా... ఇవాల్టికి వస్తుందా?’ అంటూ ప్రశ్నించాడు. మరోవైపు చిరంజీవీ కూడా ట్వీట్ చేశారు. నేను వెయిట్ చేస్తున్నానంటూ అంటూ మెగాస్టార్ పోస్టు పెట్టారు. మెగాస్టార్ ట్వీట్‌కు రాజమౌళి స్పందించారు. ‘సార్... అంటే... అది కొంచెం.. కొంచెం యాక్చువల్ గా ప్లీజ్ సార్’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో రామ్ చరణ్‌కు ఎన్టీఆర్ గిఫ్ట్ ఇవాళే అందుతుందా లేదా అని అటు తారక్ అభిమానులు... ఇటు మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గిఫ్ట్ ఏంటో చెప్పు అంటూ అటు ఇద్దరు హీరోలు ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఉగాది రోజున RRR మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అందులో ఇద్దరు హీరోలు అభిమానులు పండగ చేసుకొనేలా రాజమౌళి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. రౌద్రం రణం రధిరం అంటూ మూవీ టైటిల్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇవాళ చరణ్ బర్త్ డే రోజున ఎన్టీఆర్ కూడా గిఫ్ట్ ఇచ్చేంది RRR మూవీకి సంబంధించినదేనని భావిస్తున్నారు. అందుకే అటు మెగా ఫ్యాన్స్‌తో పాటు... ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం దీనిపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UkhwCz
v
No comments:
Post a Comment