Saturday, 7 March 2020

ఇలాగైతే ఇక మంచి సినిమాలే రావు: కంటతడి పెట్టిన తమ్మారెడ్డి భరద్వాజ

కరుణ కుమార్ దర్శకత్వంలో రక్షిత్‌, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పలాస 1978’. ఒక చిన్న సినిమాగా మొదలయినా కూడా ఈ సిమిమాని పెద్ద వాళ్లంతా చూసి బాగుంది అని చెప్పడంతో హైప్ క్రియేట్ అయిపోయింది. అల్లు అరవిందే స్వయంగా కరుణ కుమార్‌ని పిలిపించి తమ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. ఓ సినిమాకు ఇంతకంటే పాపులారిటీ ఇంకేముంటుంది. కానీ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది కానీ అనుకున్నంత స్థాయిలో ఎవ్వరూ ఆదరించలేకపోతున్నారని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బాధపడ్డారు. ఈరోజు పలాస 1978 థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ‘పలాస సినిమాలో ఎవ్వరూ నటించలేదు. జీవించారు. డైలాగ్స్ రాసినట్లుగా లేదు. ఎవరికి వారు సొంతంగా మాట్లాడుకున్నంత సహజంగా ఉంది. మంచి సినిమాలు కావాలి అంటారు. తీస్తే చూడరు. ఈ సినిమాలో దళారులను ఒకప్పుడు ఎలా చూసేవాళ్లు అని చూపించారు. మరి వాళ్లే సినిమాను చూడకపోతే ఇంకెవరు చూస్తారు. ఈ సినిమాలో ఎవ్వరినీ ఎక్కువ చేసి చూపించలేదు ఎవ్వరినీ తక్కువ చేసి చూపించలేదు. నేను ఎన్నో సినిమాలు తీసాను. కొన్ని ఆడాయి, కొన్ని పోయాయి" READ ALSO: " నా సినిమాలు ఆడకపోతే నేను ఎప్పుడూ బాధపడింది లేదు. కానీ ఈ సినిమా ఆడకపోతే కచ్చితంగా బాధపడతాను. ఈ సినిమాను మీరు చూడకపోతే ఇక ఇండస్ట్రీలో మంచి సినిమాలే రావు. సినిమా చూడకపోవడం మీ ఖర్మ అనే చెబుతాను. ఇదంతా కోపంతో కాదు బాధతో చెప్తున్నాను. దయచేసి ఇలాంటి సినిమాలను బతికించండి. డబ్బుల కోసం ఈ సినిమాను తీయలేదు. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలి అనుకున్నాం. మాకు డబ్బులు రాకపోయినా ఫర్వాలేదు’ అంటూ కన్నీరుపెట్టుకున్నారు భరద్వాజ. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aAlZ9l
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...