Sunday, 8 March 2020

సీఎంగా పవన్ కళ్యాణ్.. జోరుమీదున్న జనసేనాని!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలను, సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గత రెండేళ్లుగా పూర్తిగా రాజకీయాలకే పరిమితమైపోయిన జనసేన అధినేత.. ఇప్పుడు రూటు మార్చారు. రాజకీయాలతో పాటు సినిమాలు కూడా ముఖ్యమేనని భావించి వరుసపెట్టి ప్రాజెక్టులు అంగీకరించారు. చడీచప్పుడు కాకుండా ఆ సినిమాలను పూర్తిచేసేస్తున్నారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమాతో ఆయన బిజీ అయిపోయారు. సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ ‘పింక్’‌కు రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలోనూ ఒక సినిమా చేస్తున్నారు పవన్. ఇది పీరియాడిక్ డ్రామా అని ఇప్పటికే ప్రచారం జరిగింది. ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారని సమాచారం. తెలంగాణ రాబిన్ హుడ్‌గా పవన్‌ను మనం చూడబోతున్నామట. ఈ రెండు సినిమాలను పవన్ కళ్యాణ్ పార్లల్‌గా పూర్తిచేసుకున్నారట. అన్నీ అనుకున్న సమయానికి పూర్తయితే.. క్రిష్ డైరెక్షన్‌లో సినిమా నవంబర్ 13న విడుదలవుతుందని సమాచారం. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా మరో సినిమా ప్రారంభంకావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. Also Read: అయితే, పవన్ కళ్యాణ్ నాలుగో సినిమాను కూడా అంగీకరించినట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ‘బద్రి’ సినిమాతో తాను పరిచయం చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్‌తో దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పవన్ చేయనున్నారని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ తరవాత మరో సినిమా రాలేదు. సుమారు ఎనిమిదేళ్ల తరవాత మళ్లీ ఆ కాంబో రిపీట్ కాబోతోందని అంటున్నారు. ఇప్పటికే పవన్‌కు పూరి స్టోరీలైన్ చెప్పారట. ప్రస్తుతం పవన్ అంగీకరించిన సినిమాలు పూర్తవ్వగానే పూరి సినిమా పట్టాలెక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను పూరి సీఎంగా చూపించబోతున్నారట. Also Read: ఇదిలా ఉంటే, ప్రస్తుతం పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’తో ఫామ్‌లోకి వచ్చిన పూరి.. విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌తో పూరి జతకట్టారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు ప్రచారం జరిగింది. కానీ, ‘లైగర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ప్రెజెంట్ టాక్. ఈ సినిమా తరవాత పవన్ సినిమాతో పూరి బిజీ అవుతారట. ఇదే గనుక నిజమైతే.. మరోసారి పూరి-పవన్ కాంబో సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేయడం ఖాయం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39zSrZw
v

No comments:

Post a Comment