Monday, 16 March 2020

జేమ్స్ బాండ్ నటికి కరోనా పాజిటివ్

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (కోవిడ్-19) రోజురోజుకి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1.69 లక్షలు దాటింది. వీరిలో 6,500 మందికి పైగా మృతిచెందారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌తో ఆదివారం మరో ఏడుగురు మృతిచెందారు. దీంతో అక్కడ మృతుల సంఖ్య 65కి చేరింది. కరోనా వైరస్ కేసుల సంఖ్య మూడు వేలు దాటింది. వీరిలో ప్రముఖ హాలీవుడ్ నటి, మోడల్ ఓల్గా కురిలెంకో కూడా ఉన్నారు. తనకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఓల్గా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘నాకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇంట్లోనే ఉన్నాను. వాస్తవానికి వారం రోజులుగా నేను అనారోగ్యంతో ఉన్నాను. జ్వరం, ఆయాసం లక్షణాలు నాలో ఉన్నాయి. మీరు జాగ్రత్త పాటించండి. దీన్ని సీరియస్‌గా తీసుకోండి’’ అని ఈ 40 ఏళ్ల ఉక్రెయిన్ నటి ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. తన ఉక్రెయిన్ ఫ్యాన్స్‌కు అర్థమయ్యేలా ఆ భాషలో కూడా రాశారు. దీంతో ఓల్గా త్వరగా కోలుకోవాలని ఆమె స్నేహితులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ‘దేవుడా, త్వరగా కోలుకో! నీ కోసం ప్రార్థిస్తున్నాం’ అని మరో ఉక్రెయిన్ నటి మిల్లా జోవోవిచ్ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే, బాండ్ గర్ల్‌గా ఓల్గా కురీలెంకోకు మంచి గుర్తింపు ఉంది. 2008లో వచ్చిన జేమ్స్ బాండ్: క్వాంటమ్ ఆఫ్ సోలేస్ చిత్రంలో డేనియల్ క్రెగ్‌ సరసన కేమిల్లే మోంటెస్ అనే బాండ్ గర్ల్‌గా ఓల్గా నటించారు. అలాగే టామ్ క్రూజ్‌తో కలిసి ‘ఒబ్లివన్’ అనే సినిమాలో చేశారు. ‘జానీ ఇంగ్లిష్ స్ట్రైక్స్ అగెయిన్’, ‘మొమెంటమ్’ వంటి చిత్రాల్లో నటించారు. ఓల్గాకు నాలుగేళ్ల కుమారుడు అలెగ్జాండర్ ఉన్నాడు. కాగా, హాలీవుడ్ లెజెండ్ టామ్ హాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్‌కు గత వారం కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. వారి తరవాత మరో హాలీవుడ్ నటికి పాజిటివ్ రావడం ఇదే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IU1TLm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...