Wednesday, 11 March 2020

‘వకీల్ సాబ్’‌‌ హీరోయిన్.. ఆమె కాదు ఈమె, ఇంతకీ ఎవరామె?

బాలీవుడ్ సంచలన చిత్రం ‘పింక్’ను తెలుగులో ‘వకీల్ సాబ్‌’గా రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ మూవీతో పవన్ కళ్యాణ్‌ రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు.. ఫస్ట్ లిరికల్ సాంగ్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మిస్తుండగా.. బోనీ కపూర్ సమర్పిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ విషయానికి వస్తే.. ఈనెల 21 నుండి ఫైనల్ షెడ్యూల్ జరుగనుంది. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పవర్ క్యాస్టింగ్‌లో కొన్ని పేర్లు ఇప్పటికే బయటకు రాగా.. హిందీలో తాప్సీ రోల్‌ను నివేదా థామస్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. మహిళా హక్కులు, స్త్రీ రక్షణ అనే సోషల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో .. పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటించబోతున్నారు. కాగా కథ ప్రకారం పవన్ భార్య పాత్ర కొరకు ఓ క్యామియో ఎంట్రీకి ఆస్కారం ఉండటంతో పవన్ పక్కన నటించే ఆ హీరోయిన్ ఎవరన్నదానిపై హాట్ టాపిక్ నడుస్తోంది. ఒరిజినల్ కథ ప్రకారం ఇందులో హీరోయిన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. నిడివి కూడా చాలా తక్కువే. అయితే తెలుగులో ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ విడుదలైన తరువాత ఒరిజినల్ కథను మార్పులు చేర్పులు చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. కమర్షియల్ అంశాలను జోడించి.. పవన్ స్టామినాకు తగ్గట్టుగా హీరోయిన్ స్క్రీన్ స్పేస్ పెంచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్‌తో నటించే ఆ బ్యూటీ ఎవరన్నదానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుండగా.. నిన్నటి వరకూ శృతి హాసన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే తాజాగా శృతి హాసన్ ప్లేస్‌ను గోవా బ్యూటీ ఇలియానా రీ ప్లేస్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలియానా గతంలో ‘జల్సా’ చిత్రంలో పవన్‌తో జోడీ కట్టగా.. శృతి హాసన్ ‘కాటమరాయుడు’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాల్లో నటించింది. ఈ ఇద్దరూ పవన్ కళ్యాణ్‌తో ఆడిపాడి ఉండటంతో వీరిలో ఎవర్ని ఫైనల్ చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. అయితే హరీష్ శంకర్-పవన్ కాంబోలో త్వరలో రాబోతున్న చిత్రంలో శృతి హాసన్ ఫైనల్ కావడంతో.. వకీల్ సాబ్‌లో ఇలియానా నటించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2vcVKqx
v

No comments:

Post a Comment