Monday, 16 March 2020

‘తోటబావి’ టీజర్: ఎగిరెగిరి తన్నుతోన్న యాంకర్ రవి

యాంక‌ర్ ర‌వి హీరోగా రూపొందిన చిత్రం ‘తోటబావి’. గౌతమి హీరోయిన్. గ‌ద్వాల్ కింగ్స్ స‌మ‌ర్పణ‌లో జోగులాంబ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఆలూర్ ప్రకాష్ గౌడ్ నిర్మించారు. దౌలు (విష్ణుప్రియ హోట‌ల్), చిన్న స్వామి, అభినేష్ స‌హ‌ నిర్మాత‌లు. అంజి దేవండ్ల ద‌ర్శక‌త్వం వహించారు. ఇటీవల ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. తాజాగా చిత్ర టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఇది యాక్షన్ మిక్స్ చేసిన థ్రిల్లర్ మూవీ అని అర్థమవుతోంది. యాంకర్ రవి విలన్లను ఎగిరెగిరి తన్నుతున్నారు. ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించినట్టు టీజర్ స్పష్టం చేస్తోంది. నిర్మాణంలో పెద్దగా నాణ్యత కనిపించడంలేదు. ఇక రవిని ఇన్ని రోజులూ కామెడీ యాంకర్‌గా చూసిన ప్రేక్షకులు ఇంత సీరియస్ రోల్‌లో చూసి యాక్సెప్ట్ చేయగలరో లేదో చూడాలి. ఇలాంటి హీరోలకు లవ్ స్టోరీలయితే బాగుంటాయి. కానీ, రవి మాత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్‌ను ఎంపిక చేసుకున్నారు. మరి ఈ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో లేదో చూడాలి. Also Read: ఈ సినిమా గురించి ఎన్.శంకర్ మాట్లాడుతూ.. ‘తోటబావి’ టైటిల్ చాలా కొత్తగా ఉందని అన్నారు. ఈ సినిమా దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ద‌ర్శకుడు అంజి దేవండ్ల మాట్లాడుతూ.. ‘‘నా సినిమా టీజర్‌ను దర్శకుడు ఎన్.శంకర్ గారు విడుదల చేయడం హ్యాపీగా ఉంది. హీరో ర‌వి ఇచ్చిన స‌పోర్ట్‌తో సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాత‌లు ఎక్కడా రాజీ ప‌డ‌కుండా సినిమాకు ఏం కావాలో అన్ని సమకూర్చి నాకు స‌హ‌క‌రించారు. తప్పకుండా మీ అందరికి నచ్చుతుందనే భావిస్తున్నాను’’ అని అన్నారు. Also Read: నిర్మాత ఆలూర్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘యాక్షన్ థ్రిల్లర్ నేప‌థ్యంలో కొత్త కాన్సెప్ట్‌తో మా ద‌ర్శకుడు క‌థ‌, క‌థ‌నాలను చాలా ఇంట్రస్టింగ్‌గా త‌యారు చేశారు. మొదటి సినిమా అయినా ఒక అనుభవం ఉన్న దర్శకుడిలా చక్కగా తెర‌కెక్కించారు. మా హీరో ర‌వి స‌పోర్ట్ మ‌రువ‌లేనిది. సినిమా మేం అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. కాగా, ఈ సినిమాలో శివ‌శంక‌ర్ మాస్టర్, ఛ‌త్రప‌తి శేఖ‌ర్, న‌ర్సింహా రెడ్డి, జ‌బర్దస్త్ అప్పారావు, జ‌బ‌ర్దస్త్ రాజ‌మౌళి, రోహిణి, ఉన్నికృష్ణ, అభి, శివం త‌దిత‌రులు న‌టించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IOhJaw
v

No comments:

Post a Comment