Sunday, 8 March 2020

రియల్ లైఫ్ క్యారెక్టర్‌కు దగ్గరగా ఉన్న పాత్రలే చేశా: ‘ఓ పిట్టకథ’ ఫేమ్ నిత్యాశెట్టి

విశ్వంత్‌, సీనియర్ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌ రావు, నిత్యాశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. ఈ చిత్రంలో బ్రహ్మాజీ కీల‌క పాత్ర పోషించారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనందప్రసాద్‌ నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమా మంచి విజయం సాధించిన సందర్భంగా హీరోయిన్ నిత్యాశెట్టి మీడియాతో మాట్లాడారు. ఆమె చెప్పిన విశేషాలు.. ✦ నేను తెలుగమ్మాయిని. చదువు మొత్తం హైదరాబాద్‌లో పూర్తి చేశాను. సినిమాల పట్ల ఉన్న ఆసక్తితో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాను. ‘అంజి’, ‘దేవుళ్ళు’ సినిమాల తరువాత రామానాయుడు గారి ‘హరివిల్లు’ సినిమా చేశాను. ఆ సినిమా తరువాత హీరోయిన్‌గా కొన్ని మూవీస్ చేశాను. ‘ఓ పిట్టకథ’ సినిమా కథ విని బాగా నచ్చడంతో చేశాను. ఆడియన్స్ నుంచి మూవీకి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఓ మంచి సినిమాలో నటించిన తృప్తి ఉంది. Also Read: ✦ నేను హీరోయిన్ గ్లామర్ రోల్స్ చెయ్యలేదు. చేసిన పాత్రలు అన్నీ నా రియల్ లైఫ్ క్యారెక్టర్‌కు దగ్గరగా ఉన్నవే. అలాంటి పాత్రే నేను ‘ఓ పిట్టకథ’ సినిమాలో చేశాను. డైరెక్టర్ చెందు ముద్దు తాను అనుకున్న పాయింట్‌ను అనుకున్నట్లు తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యారు. భవ్య క్రియేషన్ ఆనంద్ గారు సినిమాను బాగా తియ్యడంతో పాటు బాగా ప్రమోట్ చేశారు. అందువల్లే సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ✦ నేను కూచిపూడి డాన్సర్‌ని. డైరెక్టర్ చెందు గారు వెంకటలక్ష్మి పాత్ర నాకు చెప్పినప్పుడు బాగా ఇష్టపడ్డాను. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మూవీ చూసి బాగుందని చెప్తుంటే సంతోషంగా ఉంది. ✦ తమిళ్‌లో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. మంచి పాత్రలు ఏ భాషలో వచ్చినా చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TvM7N8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...