Thursday, 5 March 2020

మహేష్ విలన్‌కు క్యాన్సర్.. సినిమాను ప్రమోట్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు

ప్రముఖ బాలీవుడ్ నటుడు బ్రెయిన్‌కు సంబంధించిన క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ లండన్‌లో చికిత్స తీసుకున్నారు. కొన్ని నెలల క్రితమే చికిత్స పూర్తవడంతో ముంబయి చేరుకున్నారు. ఆ తర్వాత ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలోనూ నటించారు. ఇందులో కరీనా కపూర్ పోలీసు పాత్రలో నటించారు. అయితే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండేందుకు ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. సినిమాను ప్రమోట్ చేయలేకపోతుండడంతో బాలీవుడ్‌కు చెందిన ఆరుగురు హీరోయిన్లతో సినిమాను ప్రమోట్ చేయించారు. ఆలియా భట్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, అనన్యా పాండే, జాన్వి కపూర్, కృతి సనన్ కలిసి ఓ వీడియోను రూపొందించారు. ఈ సినిమాలోని ‘కుడి ను నాచ్నే దే’ అనే పాటకు ఈ స్టార్ హీరోయిన్స్ అంతా కలిసి డ్యాన్స్ చేస్తూ వీడియోను రూపొందించారు. ఎవరికి వారు తమకు నచ్చినట్లుగా డ్యా్న్స్‌లు చేస్తూ వీడియో చేసారు. ఈ వీడియోను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విటర్ ద్వారా రిలీజ్ చేసారు. ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ వీడియోలో కనిపించిన ప్రతీ హీరోయిన్ చాలా బిజీగా ఉన్నారు. అయినప్పటికీ హీరోకి ఒంట్లో బాగోలేదని తెలిసి కాస్త సమయం తీసుకుని మరీ ఈ వీడియో రూపొందించేందుకు ముందుకు రావడం చక్కటి విషయం. READ ALSO: 2017లో వచ్చిన ‘హిందీ మీడియం’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. ఇంగ్లీష్ మీడియంలో పెద్ద చదువుకోవాలని కోరుకునే కూతురి కోసం ఓ తండ్రి ఎన్ని పాట్లు పడాల్సి వచ్చింది అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను హోమీ అదాజానియా రూపొందించారు. మార్చి 13న సినిమా రిలీజ్ కానుంది. తెలుగులో వచ్చిన ‘సైనికుడు’ సినిమాలో ఇర్ఫాన్ పప్పు యాదవ్ అనే విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wxpuP6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...