Tuesday, 3 March 2020

ఏం తింటారయ్యా మీరూ, ఎలా డ్యాన్స్ చేస్తారు: బన్నీపై హృతిక్ కామెంట్

ఇండస్ట్రీలో ఎంత స్టార్‌డం ఉన్నా అందరు హీరోలు డ్యా్న్స్‌లు ఇరగదీయలేరు. కొరియోగ్రాఫర్ చెప్పినట్లు డ్యా్న్స్ చేసే హీరోలు వేరు, నరనరాల్లో జీర్ణించుకుపోయినట్లు డ్యాన్స్ చేసే హీరోలు వేరు. అలాంటివారిలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు ఎప్పుడూ ముందుంటారు. అయితే బన్నీ డ్యాన్స్ చేసే విధానానికి హృతిక్ కూడా ఫిదా అయిపోయారు. నిన్న హృతిక్ ఏదో పని మీద చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా దక్షిణాది సినిమాలు, ఇక్కడి స్టార్ సెలబ్రిటీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ‘నేను ఏదైనా చేయాలని అనుకుంటే దాని గురించి ఏమీ ఆలోచించను. వెంటనే చేసేస్తాను. నేను ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించాను. ఆ సినిమాలన్నీ కథ విన్న అరగంటలోనే ఓకే చేసేసాను. అంతేకానీ వాటి గురించి ఆరా తీసి ఓకే చెప్పడంలాంటివి చేయను. ఒకవేళ అరగంటలో నేను సినిమాకు యస్ చెప్పకపోతే ఆ సినిమా చేయనని అర్థం" READ ALSO: " నేను ఇప్పటివరకు ఏ దక్షిణాది సినిమాను చూడలేదు. కానీ ఇక్కడి సినిమాల్లో ఆర్టిస్టిక్ టెక్నికాలిటీస్ అంటే చాలా ఇష్టం. సౌత్ సినిమాల నుంచి ఈ విషయాన్ని బాలీవుడ్ నేర్చుకోవచ్చు. అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే నాకూ ఇష్టమే. చాలా ఎనర్జిటిక్‌గా, స్ట్రాంగ్‌గా, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. విజయ్ డ్యాన్స్‌ కూడా బాగుంటుంది. అసలు ఏం తింటారయ్యా వీళ్లు. డ్యాన్స్ చేసేటప్పుడు ఆ ఎనర్జీ లెవల్ అద్భుతంగా ఉంటుంది’ అని వెల్లడించారు హృతిక్. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘వార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు హృతిక్. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయింది. ఇక్కడ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం హృతిక్ చేతిలో సినిమాలు ఏమీ లేవు. ఇంకా దేనికీ ఆయన ఓకే చేయలేదు. బహుశా క్రిష్ 4 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండి ఉంటారని తెలుస్తోంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2vsjWWg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...