పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఏ క్యారెక్టర్ దొరికినా చేయడానికి తలకింద తపస్సు చేసేవాళ్లు చాలా మందే ఉంటారు. ఇక ఆయన పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశం వస్తే మేఘాల్లో తేలిపోతారు. ఆ తర్వాత సినిమాలు రాకపోయినా పవన్ సినిమాలో హీరోయిన్‌గా చేసింది ఆమే అన్న గుర్తింపైనా వస్తుంది అనుకుంటారు. అలా పదేళ్ల క్రితం పవన్‌తో కలిసి నటించిన ‘పులి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు . పవన్ హీరో, ఏ.ఆర్ రెహమాన్ సంగీతం, ఎస్ జే సూర్య డైరెక్షన్.. కాంబో అదిరింది. కానీ ఏమైందో తెలీదు కానీ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. దాంతో ఈ సినిమా నికీషాకు బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత తమిళం, తెలుగులో కలిసి నికీషా 25 సినిమాల్లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనైనా లక్ పరీక్షించుకోవాలని అనుకుంది. అక్కడ కూడా వర్కవుట్ కాలేదు. ఇక చేసేదేంలేక ఇక్కడి సినిమాలకు రాం రాం చెప్పేసిందట. మీడియా వర్గాలు తనను ‘పవన్ కళ్యాణ్ హీరోయిన్’ అని సంబోధిస్తారే తప్ప సొంత పేరుతో ఎప్పుడూ పిలిచిందిలేదని నికీషా హర్ట్ అయ్యారట. READ ALSO: అంతేకాదు ఇక్కడి సినిమాలు తనకు వర్కవుట్ కావు అనుకుని లండన్ వెళ్లిపోయారట. అక్కడ ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని బ్రిటిష్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇండస్ట్రీలో శిక్షణ తీసుకుని అక్కడి సినిమాల్లోనైనా రాణించాలని అనుకుంటున్నారట. కొన్ని నెలలుగా నికీషా అక్కడే ఉంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలో తన పాత్ర నచ్చితేనే భారతీయ చిత్ర పరిశ్రమలో అడుగుపెడతానని చెప్పి మరీ వెళ్లిపోయినట్లు సినీ వర్గాల సమాచారం. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38fruZt
v
No comments:
Post a Comment