Monday, 2 March 2020

పెళ్లైన వ్యక్తితో ఎప్పుడూ ఎఫైర్ పెట్టుకోకండి: సీనియర్ నటి సలహా

ప్రముఖ బాలీవుడ్ నటి జీవితంలో పడిన కష్టాలు ఏ ఆడదానికీ ఎదురుకాకూడదనే అనుకోవాలి. నటిగా నిరూపించుకోవాలని ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె.. ప్రముఖ వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో వీరిద్దరి గురించి రోజూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉండేది. అప్పటికే వివ్ రిచర్డ్స్‌కి పెళ్లైపోయింది. అయినా కూడా వీరిద్దరూ ఏళ్ల తరబడి సహజీవనం చేసారు. ఫలితంగా నీనా గర్భం దాల్చారు. ఈ విషయాన్ని వివ్ రిచర్డ్స్‌కి చెప్తే ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. ఆ తర్వాత రిచర్డ్స్ తన మొదటి భార్య వద్దకు వెళ్లిపోయారు. అలాగని నీనాను పూర్తిగా రోడ్డున పడేయలేదు. వీలు కుదిరినప్పుడల్లా వచ్చి ఆమె బాగోగులు చూసేవారు. ఎంత చూసుకున్నా కూడా మొదటి భార్య ఉండగా మరో మహిళతో సంబంధం పెట్టుకోవడమనేది నేరం. ఈ విషయం నీనాకు బాగా అర్థమైంది కాబట్టే.. చాలా సార్లు రిచర్డ్స్ భార్యకు ఫోన్ చేసి తమ ఎఫైర్ గురించి క్లియర్‌గా వివరించారట. అయినా ఆమె ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని నీనా ఓ వీడియో ద్వారా వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. జీవితంలో తోడు లేకపోతే ఒంటరిగా అయినా బతకగలగాలి కానీ పెళ్లైన వ్యక్తితో అఫైర్ పెట్టుకోకూడదని తెలిపారు. READ ALSO: ఈ వీడియో పోస్ట్ చేసాక చాలా మంది నెటిజన్స్ నీనా ధైర్యాన్ని మెచ్చుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అన్ని కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో నేను ఫలానా తప్పు చేసాను ఆ తప్పు మీరు చేయకండి అని చెప్పే సెలబ్రిటీలు కూడా ఉన్నారంటే నిజంగా గొప్ప విషయమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రిచర్డ్స్‌కు పుట్టిన కూతురు ఎవరో కాదు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా. ఆమె కూడా తండ్రిలేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొంది. ఎవరు ఎన్ని చెప్పినా తన తండ్రి వివ్ రిచర్డ్స్ అని చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడటం లేదని మసాబా చాలా సార్లు బల్లగుద్ది చెప్పింది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32K6JnB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...