Tuesday, 17 March 2020

కరోనా ఎఫెక్ట్ హౌస్ అరెస్ట్‌లో కమెడియన్ ప్రియదర్శి

ప్రముఖ తెలుగు కమెడియన్, మల్లేశం ఫేమ్ ప్రియదర్శి తనకు తానుగా గృహ నిర్బంధం చేసుకున్నాడు. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ప్రియదర్శి కారణంగా... వైద్యుల సూచనల మేరకు సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాడు. 14 రోజుల పాటు తాను ఇల్లు కదిలేది లేదని చెప్పాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు ప్రియదర్శి. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా షూటింగు కోసం ఇటీవలే జార్జియా వెళ్లాడు. అక్కడ తన షూటింగ్ పూర్తికావడంతో... తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరీక్షల అనంతరం నేరుగా ఇంటికి వెళ్లాడు ప్రియదర్శి. 14 రోజులపాటు బయటకు రాకూడదని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తనకు తాను క్లీన్‌చిట్ ఇచ్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. వైద్యుల సూచన మేరకు 14 రోజులపాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉంటానన్నాడు. దీంతో ప్రియదర్శి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చినవారికే కరోనా వైరస్ సోకుతుంది. ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన ఐదు కేసుల్లో ఇదే జరిగింది. అందుకే విదేశాల నుంచి వచ్చిన వారు జాగ్రత్తగా ఉండాలని.. అటు అధికారులు, ఇటు వైద్యులు కోరుతున్నారు. నలుగురితో కలవకుండా కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉండాలంటున్నారు. చైనాలోని పుహాన్ లో మొదలైన కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 163 దేశాల్లో విస్తరించింది. వరల్డ్ వైడ్‌గా కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇటు ఇండియాలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 147 ఉన్నాయని అధికారిక ప్రకటన విడుదలైంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b8jLhZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...