Monday, 16 March 2020

ఆ యంగ్ డైరెక్టర్‌‌కు మహేష్ బాబు ఫిదా

టాలీవుడ్ రాకుమారుడు చాలా ప్రత్యేకం. ఆయన ఎంత స్పెషల్‌గా ఉంటాడో .. ఆయన తీస్తున్న సినిమాలు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి. పోకిరి, అతడు, బిజినెస్ మ్యాన్, దూకుడు, ఖలేజా, శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ ఇలా మహేష్ చేసిన ఏ సినిమా చూసినా ... అందులో ఓ కొత్త విషయం కనిపిస్తుంది. కొత్త కొత్త ఆలోచనలతో కథలతో ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు మహేష్ ప్రయత్నిస్తుంటాడు. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత... మహేష్ కథల్ని చాలా జాగ్రత్తగా సెలక్ట్ చేసుకుంటున్నాడు. అయితే అందుకే ఆయన యంగ్ టాలెంట్ పైనే.. ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. 'సరిలేరు నీకెవ్వరు'తో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇచ్చిన మహేష్.. త్వరలో పరశురామ్‌ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీరస్తు శుభమస్తు, యువత వంటి సినిమాల్ని తీసని పరుశరామ్ తొలిసారి థ్రిల్లర్ స్టోరీతో మహేష్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ నుంచి మరో యంగ్ డైరెక్టర్‌కు అదిరే ఆఫర్ వచ్చినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దర్శకుడు . ఈ మధ్య నితిన్‌తో కలిసి వెంకీ తీసిన సినిమా ‘’. ఈ సినిమా హిట్ టాక్ రావడంతో వెంకీకి పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల 'భీష్మ'ను చూసిన మహేష్‌కు ఆ మూవీ చాలా బాగా నచ్చింది. దీంతోనే... మహేష్ దర్శకుడు వెంకీకి ఫోన్ చేసి తన వద్దకు పిలిపించుకున్నాడు. అంతేకాదు తనకు సెట్ అయ్యేలా మంచి కథను కూడా సిద్ధం చేయమన్నాడట. మంచి స్టోరీ రెడీ చేసి తన వద్దకు రావాలని కోరాడు మహేష్. దీంతో ఇప్పుడు వెంకీ...మహేష్ కోసం మరో కథను సిద్ధం చేసే పనిలో పడినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే మహేష్ బాబు ... రానున్న రోజుల్లో వెంకీ కుడుముల డైరెక్షన్లో నటించే అవకాశలు లేకపోలేదు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సైతం వెంకీ కుడుములను అభినందించారు. అతనితో కలిసి చిరు భీష్మ సినిమా కూడా చూశారు. ఏదీ ఏమైనా భీష్మ సినిమా సక్సెస్‌తో డైరెక్టర్ వెంకీ తలరాత మారిపోయింది. టాలీవుడ్ అగ్రనటులు ఆశీర్వాదం లభిస్తుంది. దీంతో అతడికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33pYa1W
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...