Monday, 9 March 2020

జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్ టైటిల్‌తో వస్తోన్న తమిళ ‘హీరో’.. ఇదిగో ట్రైలర్

‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు తమిళ హీరో శివకార్తికేయన్. ఆ సినిమాలో శివకార్తికేయన్ నటనకు చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే, ఆ తరవాత ‘సీమరాజా’గా వచ్చిన ఈ యంగ్ హీరో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయారు. స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఈ చిత్రం తమిళంలోనూ సరిగ్గా ఆడలేదు. అయితే, ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు శివకార్తికేయన్. శివకార్తికేయన్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా తమిళంలో వచ్చిన చిత్రం ‘హీరో’. కిందటేడాది డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులోకి అనువాదం చేశారు. ‘శక్తి’ టైటిల్‌తో మార్చి 20న విడుదల చేస్తున్నారు. తమిళ వెర్షన్ విడుదలైన సరిగ్గా మూడు నెలలకు తెలుగులో ఈ చిత్రం విడుదలవుతోంది. కాగా, పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను సోమవారం (మార్చి 9న) ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. Also Read: కాగా, ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈయన ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, ఇవానా, రోబో శంకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సూపర్ హీరో మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించారు. కాగా, ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక సోషల్ మెసేజ్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. చదువు, విద్యార్థులతో ముడిపడి ఉన్న కథ ఇది. ఇదిలా ఉంటే, గతంలో మిత్రన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా వచ్చిన ‘ఇరుంబుతిరై’ సినిమాను తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదల చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IuM9hT
v

No comments:

Post a Comment