Thursday, 5 March 2020

పునర్నవి కోసం రాహుల్‌పై దాడి చేసారా: ఉలిక్కిపడే విషయాలు బయటికొస్తాయట

ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై మొన్న రాత్రి గచ్చిబౌలిలోని పబ్‌లో ఎటాక్ జరిగింది. వికారాబాద్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రిషిత్ రెడ్డి తన ఫ్రెండ్స్‌తో కలిసి రాహుల్‌పై బీర్ బాటిల్స్‌తో ఎటాక్ చేసారు. ఈ ఘటనలో రాహుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే రాహుల్‌కు మంచి ఫ్రెండ్ అయిన పునర్నవి భూపాలం కోసం ఈ ఎటాక్ చేసినట్లు తెలుస్తోందని అంటున్నారు ప్రముఖ సీనియల్ సినీ విశ్లేషకులు ఇమంది రామారావు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించి ఉలిక్కిపడే నిజాలు బయటికి వస్తాయని చెప్పారు. ‘‘ఇక్కడ పాత కక్షలుగా కనిపిస్తున్నాయి. బీర్ బాటిల్స్ పగలగొట్టాల్సినంత సీరియస్ విషయం ఏమీలేదు. పునర్నవి, రాహుల్ మంచి ఫ్రెండ్స్. అయితే పునర్నవితో ఫ్రెండ్‌షిప్ కోరుకునేవారు రాహుల్‌కి బుద్ధి చెప్పేందుకు చేసిన ప్రయత్నంలా కనిపిస్తోంది. పునర్నవి చాలా తెలివైంది. ఎందుకంటే రాహుల్ పేరు చెప్పగానే తను కేవలం బిగ్‌బాస్‌లో నా తోటి కంటెస్టెంట్ అంతకుమించి ఏమీ లేదు అంటుంది. మరోపక్క రాహుల్ నాకు నెక్లెస్ ఎప్పుడు చేయిస్తున్నావ్, నాకు ఆ గిఫ్ట్ ఎప్పుడిస్తున్నావ్ అని కూడా పంచ్‌లు వేస్తుంటుంది. రాత్రి దాడి వెనక బలమైన కారణంఉంది. అందుకే ఎఫైఆర్ పెట్టకుండా వెళ్లిపోయాడు. రాహుల్‌లో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. తనపని తాను చేసుకుపోయే వ్యక్తి. అందుకే ఆయనకు లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో పునర్నవి రాహుల్‌ను చాలా దూరంపెడుతోంది" READ ALSO: "దాడి ఘటనలో పునర్నవి పాత్ర ఉందా లేదా అన్నది విచారణలో తెలుస్తుంది. రాహుల్ కూడా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తే బాగుంటుంది. ఏదో జరిగే ఉంటుందని క్లియర్‌గా అర్థమవుతోంది. కేవలం రాహుల్ ఇద్దరు అమ్మాయిలను తీసుకెళ్లడం వారిపై రితేష్ రెడ్డి, అతని ఫ్రెండ్స్ కామెంట్స్ చేయడం వల్ల గొడవ అయిందంటే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే రాహుల్‌కి పునర్నవి, వరుణ్ సందేశ్, వితిక కూడా స్నేహితులే. వారితో కూడా చాలా సార్లు పబ్‌కి వెళ్లాడు. అప్పుడు జరగని గొడవ ఇప్పుడు ఎందుకు జరిగింది. త్వరలో మనకు ఈ విషయాలన్నీ బయటికి తెలుస్తాయి. రాహుల్‌కు ప్రాణహాని ఉందని తెలిసాక అతను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ సీనియర్ సినీ విశ్లేషకుడిగా నేను ఏం చెప్పగలను అంటే.. ఈ కేసు విషయంలో కీలక విషయం బయటికి వస్తుందని, ఉలిక్కి పడే విషయం బయటికి వస్తుందని నాకు అనిపిస్తోంది" అని వెల్లడించారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cAhPAh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...