Monday, 9 March 2020

నాకు లిప్‌లాక్ అంటే తెలీదు, చూసి నేర్చుకున్నా: మల్లు హీరోయిన్

మితిమీరిన లిప్ లాక్ సీన్లు దక్షిణాది చిత్ర పరిశ్రమలో కంటే బాలీవుడ్‌లో ఎక్కువగా ఉంటాయి. శ్రుతిమించిన బోల్డ్ సన్నివేశాలను కూడా ప్రాంతీయ సినిమాల్లో ఎక్కడా చూపించరు. అందులో మలయాళ చిత్ర పరిశ్రమలో అయితే ఇప్పటికీ ఓ లిప్ లాక్ సీన్‌ను తీయాలంటే కాస్త ఆలోచిస్తారు. కానీ 2011లో ‘చప్ప కురీషు’ అనే సినిమా ఒకటి వచ్చింది. అందులో ఫాహద్ ఫాసిల్, రమ్యా నంబీశన్ జంటగా నటించారు. ఈ సినిమాలో బోల్డ్ లిప్ లాక్ సీన్లు చాలానే ఉన్నాయి. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడిచిపోతున్నా ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారంటే అందుకు కారణం సినిమాలో చూపించిన లిప్ లాక్ సన్నివేశాలే కారణం. అయితే ఆ సీన్ల గురించి రమ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘నిజయతీగా చెప్పాలంటే అప్పట్లో నాకు అసలు లిప్ లాక్ అంటే ఏంటో కూడా తెలీదు. నా జీవితంలో ఎవ్వరినీ ముద్దు పెట్టుకోలేదు. తొలిసారి ముద్దు పెట్టుకుంది అందులోని హీరోనే. ఎవ్వరూ దీనిని నమ్మరు కానీ ఇది నిజం. నాకు దర్శకుడు సమీర్ లిప్ లాక్ సీన్ గురించి చెప్పగానే అసలు నాకు ఆ పదానికి అర్థం ఏంటో కూడా తెలీదని ఆయనకు చెప్పానుు. కానీ ఆయన మాత్రం ఎలాగైనా ఆ సన్నివేశాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు' READ ALSO: ' దాంతో లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న ‘కమీనా’ అనే సినిమా చూసాను. ఆ తర్వాత ఆ కిస్సింగ్ సీన్స్‌లో నటించాను. అందులో తప్పేం లేదు. నేను నటిని కాబట్టి ఎలాంటి సీన్ ఇచ్చినా చేయాలి. అయితే ఇలాంటి బోల్డ్ సీన్లలో నటించినప్పుడు ప్రేక్షకులు నాలోని నటినే కాదు సాధారణ అమ్మాయిని కూడా తప్పుగా అర్థం చేసుకుని నోటికొచ్చిన కామెంట్స్ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం ప్రేక్షకుల మైండ్‌సెట్‌లో కూడా మార్పు వచ్చింది’ అని తెలిపారు. రమ్య ఎక్కువగా మలయాళంలోనే సినిమాలు చేసారు. ఆమెకు అక్కడ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు ఉంది. తెలుగులో రెండు మూడు సినిమాలు చేసారు. కానీ అవి రిలీజ్ అయినట్లు కూడా ఎవ్వరికీ తెలీకపోవడంతో ఇక్కడ అంతగా పేరు రాలేదు. ప్రస్తుతం రమ్య చేతిలో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39C5cCX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...