Thursday, 19 March 2020

భయం, నిర్లక్ష్యం రెండూ వద్దు... కరోనాపై మెగాస్టార్ చిరంజీవి

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుంది. భారత్‌లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. దీంతో అంతా అప్రమత్తమవుతున్నారు. ప్రభుత్వానికి మద్దతుగా సినీతారలు సైతం కరోనాపై అలర్ట్ మెసేజులు పెడుతున్నారు. షూటింగ్స్, వేడుకల్ని రద్దు చేసుకుంటున్నారు. సినిమాల విడుదల్ని కూడా నిలిపివేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తమ బర్త్ డే వేడుకలు నిర్వహించొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. మోహన్ బాబు కూడా తన బర్త్ డే సందర్భంగా ప్రతీ ఏటా నిర్వహించే విద్యానికేతన్ యానివర్శరీ వేడుకల్ని సైతం రద్దు చేశారు. ఇప్పుడు అభిమానుల కోసం ప్రత్యేక వీడియోను పోస్టు చేశారు. కరోనా వైరస్‌కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మహమ్మారిని వ్యాపించకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. ఈ విషయంలో ప్రతీ ఒకరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. మనకు ఏదో అయిపోతుందన్న భయం... ఏంకాదన్న నిర్లక్ష్యం రెండు కూడా పనికిరావన్నారు. జాగ్రత్తగా ఉండే ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. జనసమూహాలకి దూరంగా ఉండాలన్నారు. కరోనా ఉధృతి తగ్గే వరకు ఇంటికి పరిమితం అవ్వడం మంచిదన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా చిరు వీడియో ద్వారా తెలిపారు. సబ్బుతో చేతుల్ని ఎక్కువసార్లు కడుక్కోవాలన్నారు. దాదాపు 20 నుంచి 30 సెకన్ల పాటు చేతులు కడగాలన్నారు. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముఖానికి, చేతులకు రుమాలు గాని.. టిష్యూ పేపర్ కానీ అడ్డుపెట్టుకోవాలన్నారు. టిష్యూను వాడిన తర్వాత చెత్త బుట్టలో పడేయాలని తెలిపారు. జలుబు, దగ్గు ఇతరులకు వ్యాపించకుండా ముఖానికి మాస్క్ ధరించాలన్నారు. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సంప్రదాయం ప్రకారం నమస్కారం పెట్టాలన్నారు. ఈ మహమ్మారి వ్యాపించకుండా ప్రతీ ఒకరు బాధ్యతతో వ్యవహరించాలని ఈ సందర్భంగా చిరు విజ్ఞప్తి చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3945Xn7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...