Monday, 2 March 2020

‘ఉప్పెన’ ఫస్ట్ సాంగ్: గజల్స్ మిక్స్ చేసి కొట్టిన డీఎస్పీ.. సో స్వీట్

మెగా కాంపౌండ్ నుంచి వస్తోన్న మరో హీరో పంజా వైష్ణవ్ తేజ్. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు. ‘ఉప్పెన’ సినిమా ద్వారా ఈయన వెండితెరకు పరిచయమవుతున్నారు. సుకుమార్ దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కృతి శర్మ హీరోయిన్. సుకుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమా నుంచి తొలి పాటను సోమవారం విడుదల చేశారు. పాట చాలా బాగుంది. దేవీ గజల్స్‌ను మిక్స్ చేసి కొట్టారు. ఈ పాటలో హిందీని కూడా మిక్స్ చేశారు. హిందీ సాహిత్యంతోనే పాట మొదలైంది. ఈ హిందీ సాహిత్యాన్ని రకీబ్ ఆలమ్ రచించారు. ఇక తెలుగు సాహిత్యాన్ని శ్రీమణి అందించారు. హిందీ వోకల్స్‌ను శ్రీకాంత్ చంద్ర ఆలపించగా.. పాటను జావేద్ అలీ పాడారు. హీరోయిన్ అందాన్ని వర్ణిస్తూ ఈ పాట సాగుతోంది. Also Read: ‘‘నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం.. నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం దారం.. నల్లనైన ముంగురులే అల్లరేదో రేపాయిలే.. నువ్వు తప్ప నాకింక వేరే లోకాన్ని లేకుండా కప్పాయిలే’’ అంటూ సాగే లిరిక్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతాయి. ముఖ్యంగా హీరోయిన్ కృతి శెట్టి సహజమైన అందానికి యూత్ కచ్చితంగా కనెక్ట్ అయిపోతారు. మరి ఇంత అందమైన పాటను మీరూ ఎంజాయ్ చేయండి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38lt0cV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...