Sunday, 8 March 2020

నెటిజన్‌కు స్టాంగ్ కౌంటర్ ఇచ్చిన జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్

జబర్దస్త్‌షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ . బుల్లితెరపై ఈ అమ్మడు చేసే హడావుడి అంతా ఇంత కాదు. జబర్దస్త్‌షోకు కూడా ఆమె ఓ స్పెషల్ అట్రాక్షన్. ఇక సుడిగాలి సుధీర్‌తో ఆమెకు ఉన్న రిలేషన్‌పై అనేకరకాల పుకార్లు షికార్లు చేస్తుంటాయి. టీవీ షోలో ఎంత యాక్టివ్‌గా కనిపిస్తుందో... సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంది రష్మీ. అనేక రకాల సామాజిక అంశాల పట్ల స్పందిస్తూ ఉంటుంది. మరో రెండు రోజుల్లో హోలీ సంబరాలు చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రష్మీ ఓ ట్వీట్ చేసింది. దయచేసి కుక్కలపై రంగులు వేయకండి అంటూ... నెటిజన్లను కోరింది. మనపై రంగులు పడితే వాటిని శుభ్రం చేసుకునేందుకు మనకు సబ్బులు ఉన్నాయి. కానీ కుక్కలకు అలాంటివేవి ఉండవంటూ చేసింది. రష్మీకి ఎప్పుడూ శునకాలంటే అమితమైన ప్రేమ. అందుకే ఆమె ఓ చిన్న కుక్కపిల్లను కూడా పెంచుకుంటుంది. తరచూ కుక్కలపై రకరకాల ట్వీట్లు పెడుతుంటుంది. వాటికి ఎలాంటి హానీ తలపెట్టకండి అంటూ నెటిజన్లకు రిక్వెస్ట్ చేస్తుంటుంది. అయితే రష్మీ పెట్టిన ఈ ట్వీట్‌పై ఓ నెటిజన్ మండిపడింది. పండగలు, పబ్బాలు వచ్చినప్పుడే మీకు ఇలాంటివి గుర్తుకు వస్తుంటాయా ? అంటూ ప్రశ్నించింది. మన పండగల్ని తక్కువ చేసేందుకు మీరు ఇలాంటి ట్వీట్లు పెడుతుంటారంటూ రష్మీపై ఆరోపణలు చేసింది. అయితే ఆ నెటిజన్ పెట్టిన ట్వీట్‌కు రష్మీ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘నాపై ఇలాంటి పోస్టులు పెట్టే ముందు ఒకసారి నేను గతంలో చేసిన పోస్టుల్ని నా పేజ్‌ను చెక్ చేయండి ’ అంటూ రష్టీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. మరోవైపు కొందరు నెటిజన్లు, ఆమె అభిమానులు రష్మీకి అండగా నిలిచారు. రష్మీ చెబుతున్నది కరెక్ట్ అంటూ సపోర్ట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో రష్మీపై ఇలాంటి విమర్శలు రావడం... వాటికి ఆమె దిమ్మతిరిగేలా సమాధానలు ఇవ్వడం ఇది తొలిసారి ఏం కాదు. ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో ఇలాంటివి చోటు చేసుకున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/331HkWO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...