Tuesday, 10 March 2020

‘302’ మూవీ ట్రైలర్: షర్ట్ విప్పేసిన వెన్నెల కిశోర్.. రచ్చ రంబోలా!!

భవికా దేశాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘302’. వెన్నెల కిశోర్, రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ‘ది ట్రూ స్టోరీ ఆఫ్ రియల్ ఫేక్’ అన్నది ఈ సినిమా టైటిల్‌కు ట్యాగ్ లైన్. కార్తికేయ మిరియాల దర్శకత్వంలో డ్రీమ్ ట్రీ మీడియా పతాకంపై అవినాష్ సుందరపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను ఇటీవల నటుడు సునీల్ ఆవిష్కరించారు. ట్రైలర్ చూస్తుంటే ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. ఈ సినిమా గురించి దర్శకుడు కార్తికేయ మిరియాల మాట్లాడుతూ.. ‘‘క్రైమ్, సస్పెన్స్, కామెడీ అంశాలతో పాటు కాస్త హారర్ అంశాలను మేళవించి ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఈ చిత్రాన్ని మలిచాం. ఒక్క రోజులో అంటే 24 గంటల్లో జరిగే కథ ఇది. ఒక అమ్మాయి ప్రేమ విషయంలో తల్లితండ్రులతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది తెరపై చూడాల్సిందే. కడుపుబ్బ నవ్వించే కామెడీ సీన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇంటర్నేషనల్ మోడల్ సూఫీ సయ్యద్ చేసిన ఐటెం సాంగ్ ఓ హైలైట్’’ అని చెప్పారు. Also Read: ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో వేణు టిల్లు, జబర్దస్త్ రాకేష్, నవీన్, దేవీచరణ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: కళ్యాణ్ సమీ, రామరాజు, సంగీతం: రఘురాం, ఎడిటింగ్: రంగస్వామి, ఆర్ట్: వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుమార్ రాజా, సహ నిర్మాత: టి..వైకుంఠరావు, నిర్మాత: అవినాష్ సుందరపల్లి, కథ - దర్శకత్వం: కార్తికేయ మిరియాల.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TBnMp8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...