Friday, 13 March 2020

‘కె.జి.ఎఫ్. చాప్టర్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్టోబర్‌లో వస్తోన్న రాకీ భాయ్

దక్షిణాది నుంచి జాతీయ స్థాయిలో ‘బాహుబలి’ తరవాత సత్తా చాటిన మరో సినిమా ‘కె.జి.ఎఫ్’. ఈ సినిమాతో కన్నడ సినిమాల మార్కెట్ కూడా అమాంతం పెరిగింది. కన్నడ ఇండస్ట్రీ టెక్నికల్‌గా అంత ఉన్నత స్థాయిలో ఉండదన్న అపవాదును చెరిపేస్తూ ‘కె.జి.ఎఫ్’ లాంటి అత్యుత్తమ నిర్మాణ విలువలతో కూడిన సినిమాను భారత సినీ ప్రేమికులకు శాండిల్‌వుడ్ నిర్మాతలు అందించారు. ఈ సినిమాతో హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో యశ్ పోషించిన రాకీ భాయ్ పాత్ర ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడిని మెప్పించింది. 2018లో విడుదలై ‘కె.జి.ఎఫ్’.. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లోనూ భారీ వసూళ్లు సాధించి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ సీక్వెల్‌ను మరింత భారీగా తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్ హీరో సంజయ్‌ దత్ ప్రతినాయక పాత్రలో నటిస్తుండటం విశేషం. అయితే, ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఇటు యశ్ అభిమానులతో పాటు.. ‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్ ఎదురు చూస్తు్న్నారు. మొత్తానికి చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించింది. Also Read: అక్టోబర్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మేరకు విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో గన్ పట్టుకుని నడిచొస్తున్న రాకీ భాయ్ షాడో ఇమేజ్ ఆసక్తి రేపుతోంది. ఈ పోస్టర్‌ను సంజయ్ దత్ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ‘2020 అక్టోబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో అధీర ప్రయాణాన్ని మీ దగ్గరలోని థియేటర్లలో చూడండి’’ అని సంజయ్ దత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్ర పేరు అధీర. కాగా, ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, అనంత్ నాగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కేఆర్జీ స్టూడియో బ్యానర్‌పై విజయ్ కిరుగందూర్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలనచిత్రం, హిందీలో ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ - ఏఏ ఫిల్మ్స్, తమిళంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు విడుదల చేస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాకి భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wV3BcG
v

No comments:

Post a Comment