Thursday, 5 March 2020

విజయ్ దేవరకొండ మైండ్ బ్లోయింగ్ డీల్, ఏడాదికి 100 కోట్లు

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు వరుసగా రెండు ఫ్లాప్స్ వచ్చాయి. ‘డియర్ కామ్రేడ్’ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మాత్రం డిజాస్టర్ అయింది. అయినప్పటికీ విజయ్ టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోనే. ప్రస్తుతం ఆయన డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ పెట్టారు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండేను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే కరణ్ విజయ్‌తో ఓ డీల్ కుదుర్చుకున్నారట. విజయ్‌కు బాలీవుడ్‌లోనూ క్రేజ్ ఉంది. అక్కడ సినిమాలు చేయకపోయినప్పటికీ తన స్టైల్, స్వాగ్‌తో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక సినిమాల్లోకి వస్తే బాలీవుడ్‌లోనూ మంచి కెరీర్ ఉంటుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో విజయ్‌తో మరిన్ని సినిమాలు చేయాలని కరణ్ అనుకుంటున్నారట. ఏడాదికి ఆయనతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అంటే విజయ్‌కు తెలుగులో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా కరణ్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి సినిమాకు ఓకే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం విజయ్ 100 కోట్లు కావాలని అడిగారట. READ ALSO: అది కూడా ఏడాదికి వంద కోట్లట. ఇందుకు కరణ్ కూడా ఒప్పుకున్నట్లు బాలీవుడ్ టాక్. విజయ్‌ను నేషనల్ స్టార్‌ను చేయాలన్న ఉద్దేశంతోనే కరణ్ ఈ డీల్‌కు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘ఫైటర్’ సినిమా కూడా ప్యాన్ ఇండియా సినిమాగానే తెరకెక్కుతోంది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయిలో వేగంగా జరుగుతోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కలిసి నిర్మిస్తున్నారు. గత రెండు సినిమాలు ఫ్లాప్ కాబట్టి ఈ సినిమాతోనైనా విజయ్ హిట్ కొట్టాల్సిందేనన్న కసితో ఉన్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PS702O
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...