అజయ్ దేవగణ్ బాలీవుడ్‌లో మంచి పేరున్న నటుడు. తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిన హీరోనే. కాకపోతే ఈయన సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ లేదు. అందుకే, తెలుగులోకి అనువాదం చేసి కూడా విడుదల చేయడంలేదు. అయితే, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న RRR సినిమాలో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించడం ద్వారా దక్షిణాదిలో మరింత మంది ప్రేక్షకులకు అజయ్ దేవగణ్ చేరువయ్యారు. ఈ ఇమేజ్‌ను ఇప్పుడు వాడుకునే పనిలో పడ్డారు ఈ సీనియర్ హీరో. అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతోన్న స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఫుట్‌బాల్ కోచ్‌గా అజయ్ దేవగణ్ కనిపించనున్నారు. భారత ఫుట్‌బాల్ చరిత్రలోని స్వర్ణయుగాన్ని ఈ చిత్రం ద్వారా తెరపై ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో రెండు పోస్టర్స్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్స్‌లో విడుదల తేదీని కూడా ప్రకటించారు. డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. Also Read: అయితే, ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలచేయనున్నారు. దక్షిణాది భాషల్లోకి అనువాదమవుతోన్న తొలి అజయ్ దేవగణ్ సినిమా ఇది. బహుశా RRR వల్ల వచ్చిన ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో భాగంగానే అజయ్ దేవగణ్ ఈ ప్రయోగం చేస్తున్నట్టున్నారు. మరి, ఈ చిత్రంతో ఆయన దక్షిణాదిలో మార్కెట్ ఏర్పరుచుకుంటారో లేదో చూడాలి. ‘బధాయి హో’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కోల్‌కతా, లక్నో, ముంబై నగరాల్లో 50 రోజులు పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌కి చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రంలో ప్రియమణి, ‘బధాయి హో’ ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్రెష్‌లైమ్ ఫిల్మ్ సహకారంతో జీ స్టూడియోస్ బ్యానర్‌పై బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OpvPm1
v
No comments:
Post a Comment