Tuesday, 25 February 2020

Mahesh Babu: మహేష్, చిరంజీవిల టచ్‌లోని శ్రీనువైట్ల.. ‘దూకుడు 2’?

తూగో జిల్లా.. కందులపాలెం దర్శకుడు శ్రీను వైట్లకు టాలీవుడ్‌లో బ్యాడ్ టైం నడుస్తోంది. , వెంకటేష్, నాగార్జున, ఎన్టీఆర్, , రామ్ చరణ్ తేజ్, రవితేజ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఈ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి వస్తుందని బహుషా ఆయనే ఊహించి ఉండరు. అయితే ఊహించుకున్నదే జరిగితే అని లైఫ్ ఎందుకు అవుతుంది. అందులోనూ రంగుల ప్రపంచంలో అది చచ్చినా కుదరదు. హిట్ కొట్టినోడే హీరో.. ఫ్లాప్ పడిందంటే ఎంత పెద్ద దర్శకుడికైనా డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్టే. ఇలా గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్‌లతో పాపం దెబ్బ మీద దెబ్బ తింటూనే ఉన్నారు. బాద్ షా‌తో హిట్లు ఆపేసిన ఈయన.. ఆడడు చిత్రంతో ఫ్లాప్ జర్నీ మొదలుపెట్టారు. బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ వంటి చిత్రాలతో పరాజయాలను చవిచూస్తూనే ఉన్నారు. దీంతో కుర్ర హీరోలే కాకుండా సీనియర్ హీరోలు సైతం ఈయనతో సినిమా చేయడానికి వెనుకంజ వేస్తున్న తరుణంలో ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది. రీసెంట్‌గా శ్రీనువైట్ల మెగాస్టార్ చిరంజీవితో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబులను కలిశారని.. ఇద్దరికీ తన వద్ద ఉన్న కథలను వినిపించినట్టు తెలుస్తోంది. గతంలో మహేష్ బాబుకి దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీనువైట్ల.. దూకుడు 2 రేంజ్‌లో కథను తయారుచేసి వినిపించినట్టు సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం శ్రీను వైట్ల కథ విని హోల్డ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చిరు, మహేష్ కాంబోలో మల్టీస్టారర్ కథను శ్రీనువైట్ల రెడీ చేశారని.. ఆ కథే ఇద్దరికీ చెప్పారనే టాక్ వినిపిస్తోంది. ఇది ఎంత వరకూ నిజమో తెలియదు కాని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఇద్దరు స్టార్లు శ్రీనువైట్లతో సినిమా చేసే ప్రయోగం చేయడం అనుమానంగానే ఉంది. చూడాలి మరి ఏం అవుతుందో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2w32BD1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...