Tuesday, 25 February 2020

కన్నీళ్లు కనపడకూడదనే అద్దాలు పెట్టుకున్నా: నితిన్

మొత్తానికి నాలుగేళ్ల తర్వాత ‘భీష్మ’ సినిమాతో హిట్ అందుకున్నారు యంగ్ హీరో నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. రష్మిక మందనకు వరసగా నాలుగో హిట్ ఇది. ఈ సందర్భంగా ‘భీష్మ’ సక్సెస్ మీట్ ఏర్పాటుచేసారు. ఈవెంట్‌లో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. రష్మికపై రెండు పంచ్‌‌లు కూడా వేసాడు. ‘ఈ సినిమాను ఇంత విజయవంతం చేసిందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాలుగేళ్ల తర్వాత హిట్ కొట్టాను. ఈ హిట్ నాకే కాదు వెంకీకి కూడా చాలా అవసరం. ఈ సినిమాతో తానేంటో నిరూపించుకుని చాలా మందికి సమాధానం చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత కొట్టిన హిట్ కావడంతో నాకు ఆనందంలో ఏడుపొస్తోంది. అందుకే ఆ కన్నీళ్లు కనపడకుండా కళ్లజోడు పెట్టుకున్నాను. ఈ క్రెడిట్ అంతా వెంకీకే దక్కాలి. అతను సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో చూసాను" READ ALSO: " తన సంగీతంలో సినిమాను మరో స్థాయి పైకి తీసుకెళ్లాడు మహతి స్వర సాగర్. ఆయన మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. ఇక మా రష్మిక మేడమ్ గురించి మాట్లాడాలంటే.. సినిమాలో మా ఇద్దరి రొమాన్స్ కంటే సంపత్ నందితో కలిసి నటించిన సీన్లనే ఎక్కువ ఎంజాయ్ చేసారు. రష్మిక మేడమ్ వెంకీకి తొలి హిట్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత నాకు ఓ హిట్ ఇచ్చారు. ఆవిడ ఇలాగే మరిన్ని విజయాలు అందుకోవాలని, ఇలాంటి పూల గౌన్లు వేసుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2w8EYsD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...