Tuesday, 11 February 2020

ఇద్దరు పిల్లలున్నారు, మళ్లీ రెండో పెళ్లేంటి: నటిని ఎగతాళి చేసిన నెటిజన్

ప్రముఖ బుల్లితెర నటి నిన్న రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఇదివరకే పెళ్లై పన్నెండేళ్ల కూతురు కూడా ఉంది. ఇప్పుడు కామ్యా వయసు 40. ఎదుగుతున్న కూతురు ఉన్నా కూడా మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఓ నెటిజన్ ఆమెను ఎగతాళి చేసాడు. అయితే దీనిపై కామ్యా స్పందించలేదు కానీ ఆమె స్నేహితురాలు, నటి కవితా కౌశిక్ స్పందించారు. ‘‘ఎందుకంటే మనకు జీవితాంతం భర్త తోడుగా ఉంటాడు కాబట్టి. పిల్లల్ని కనడం కంటే జీవితంలో ఇంకా ఎంతో ఉంటుంది కదా. ఏదో ఒక రకంగా ఆనందం వెతుక్కోవాలని అనుకుంటున్న వారిలో తప్పులు వెతికి వేలెత్తి చూపకండి. ఇతరులు సంతోషంగా ఉంటున్న సమయంలో వారిని సిల్లీ ప్రశ్నలు అడగకుండా మీరు కూడా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. మరో విషయం ఏంటంటే.. వారి పిల్లలే సెలబ్రేషన్స్ ప్లాన్ చేసారు’’ అని తెలిపారు. సెలబ్రిటీలను టార్గెట్ చేసి వారిని ట్రోల్ చేయడం చాలా సులువు అనుకుంటూ ఉంటారు నెటిజన్లు. వారు కూడా మనుషులే, వారికీ మనసుంటుంది అని ఆలోచించకుండా నోటికొచ్చిన కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొందరు సెలబ్రిటీలు తమను ట్రోల్ చేసినవారిని బ్లాక్ చేస్తుంటారు. మరికొందరు మూతిపగిలేలా సమాధానాలు ఇస్తుంటారు. గతంలోనూ కామ్యా పంజాబీకి ఓ నెటిజన్ నుంచి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తాను తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు కామ్యా వెల్లడించగానే ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ కామ్యాపై కామెంట్ చేస్తూ.. ‘ఈ బేకార్ నటితో ఎందుకు డేటింగ్ చేస్తున్నారు? ఇతర మహిళలను తక్కువ చేసి మాట్లాడుతూ తన పరువు తానే తీసుకుంటోంది. అవసరం కోసం ఆమె తన కూతురిని కూడా అమ్మేసే టైప్’ అని కామెంట్ చేశాడు. READ ALSO: దాంతో కామ్యా భర్త మూతిపగిలేలా సమాధానం ఇచ్చాడు. ‘‘చూడూ.. నీకు దమ్ముంటే నీ ప్రొఫైల్ ఫొటో పెట్టి ఇలాంటి కామెంట్స్ చెయ్యి. ఓ మహిళ గురించి, అమాయకురాలైన ఆమె కూతురి గురించి ఇలా నీచంగా మాట్లాడే హక్కు నీకు లేదు. నీకు ట్రీట్‌మెంట్ చాలా అవసరం’’ అని సమాధానమిచ్చాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37hJxOv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...