Tuesday, 25 February 2020

‘భీష్మ’ బాక్సాఫీస్ కలెక్షన్: నాలుగో రోజూ సత్తా చాటిన నితిన్

సాధారణంగా టాలీవుడ్‌లో సినిమాలన్నీ శుక్రవారం నాడు విడుదలవుతుంటాయి. దానికి కారణం సినిమాకు తొలిరోజు మంచి టాక్ వస్తే వారాంతం శని, ఆదివారాల్లో కలెక్షన్లు కుమ్మేయొచ్చని. నిజంగానే ఈ రెండు రోజుల్లో సినిమాలకు మంచి వసూళ్లు వస్తాయి. అయితే, ఆ ఊపు సోమవారం కూడా కొనసాగడం కాస్త కష్టమే. స్టార్ హీరోల సినిమాలు అయితేనే సోమవారం కూడా మంచి వసూళ్లు వస్తాయి. అందుకే, ప్రతి హీరో మండే టెస్టును పాస్ కాలేరు. కానీ, ఇప్పుడు నితిన్ మండే టెస్ట్ పాసైపోయారు. నితిన్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో శని, ఆదివారాల్లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ మూడు రోజుల్లో వచ్చినంత కాకపోయినా సోమవారం కూడా మంచి వసూళ్లను రాబట్టింది ‘భీష్మ’. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.82 కోట్ల షేర్‌ను ‘భీష్మ’ వసూలు చేసింది. Also Read: ‘భీష్మ’ నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.71 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. ఒక మీడియం బడ్జెట్ సినిమాకి అందులోనూ ఫిబ్రవరి లాంటి నాన్-సీజన్‌లో నాలుగు రోజుల్లో ఇంత మొత్తం వసూలు కావడం గొప్పే. ఈ సినిమా తొలిరోజు రూ. 6.28 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. రెండో రోజు రూ. 4.24 కోట్లు, మూడో రోజు రూ. 4.37 కోట్లు రాబట్టింది. మొత్తం ఫస్ట్ వీకెండ్ తెలుగు రాష్ట్రాల్లో ‘భీష్మ’ రూ. 14.89 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక సోమవారం నాటి రూ. 1.82 కోట్ల షేర్ కలుపుకుని నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వసూలైన షేర్ విలువ రూ. 16.71 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా నాలుగు రోజుల్లో ‘భీష్మ’ వసూలు చేసిన షేర్ నైజాం - రూ. 6.64 కోట్లు సీడెడ్ - రూ. 2.55 కోట్లు ఉత్తరాంధ్ర - రూ. 2.13 కోట్లు గుంటూరు - రూ. 1.51 కోట్లు కృష్ణా - రూ. 1.05 కోట్లు తూర్పు గోదావరి - రూ. 1.32 కోట్లు పశ్చిమ గోదావరి - రూ. 97 లక్షలు నెల్లూరు - రూ. 54 లక్షలు మొత్తం - రూ. 16.71 కోట్లు


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c0bg9X
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...