మంచు వారి చిన్నబ్బాయి నెటిజన్‌కి సారి చెప్పాడు.. ఇచ్చిన మాట తప్పడంతో నిలదీసిన నెటిజన్‌కు సారీ చెప్పలేదు. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. మంచు మనోజ్ సోషల్ మీడియా యమా యాక్టివ్‌గా ఉంటాడు. మనోడికి సినిమా అప్డేట్స్ ఏం లేకపోవడంతో పర్శనల్ విషయాలను షేర్ చేస్తూ.. అప్పుడప్పుడూ ఇతర హీరోల సినిమాలపై కూడా స్పందనలు తెలియజేస్తూ నెటిజన్లకు అందుబాటులో ఉంటున్నాడు. Read Also: ఇటీవల తన పెళ్లి బ్రేకప్ విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు చేరవేశాడు మంచు మనోజ్. ఆ తరువాత అంటే.. జనవరి 28, 2020 నాడు.. ‘ఫైర్ బాల్‌గా వెలగడానికి అంతా సెట్ అయ్యిందని.. ఈ వీక్‌లో తన నుండి ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ ఉండబోతుంది.. వేచి చూడండి’ అంటూ పోస్ట్ పెట్టారు. కొంపతీసి రెండో పెళ్లి చేసుకుంటున్నావా? అన్నా అని నెటిజన్లు స్పందించడంతో ‘వామ్మో మళ్లీ పెళ్లా’? అన్నట్టుగా దండాలు పెట్టేశాడు. Read Also: దీంతో పెళ్లి కోసం అయ్యి ఉండదులే.. మనోడు ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తరువాత ఒక్కడిగానే మిగిలిపోవడంతో వెండితెరపై జంట కట్టేందుకు సినిమా అప్డేట్స్‌తో రావడం కోసమే ఈ పోస్ట్ అనుకున్నారంతా. అయితే మంచు మనోజ్ జనవరి 28న ఈ వారంలో ఆసక్తికరమైన అనౌన్స్ మెంట్ ఉంటుందని చెప్పి రెండు వారాలపైనే అయ్యింది.. ఇంకా అప్డేట్ రాకపోవడంతో మంచు మనోజ్‌ని ట్యాగ్ చేస్తూ.. ‘వీక్ టైం అంటే 20 లేదా 30 వీక్స్ తరువాతనా అన్నా.. త్వరగా చెప్పు అన్నా’ అని ఓ నెటిజన్ నిలదీయడంతో మంచు మనోజ్ లైన్ లోకి వచ్చాడు. సారీ తమ్ముడూ.. ఇంకొంచెం టైం వెయిటింగ్ అంతే అంటూ నవ్వుతూ ఏడుస్తున్న, దండం పెడుతున్న, లవ్ ఎమోజీలను షేర్ చేశాడు. అయితే ఇంకొంచెం టైం పడుతుందని చెప్పడంతో ఈవారానికి మంచు మనోజ్ నుండి వచ్చే అప్డేట్స్ లేనట్టే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HdywDh
v
No comments:
Post a Comment