Tuesday, 4 February 2020

‘లవ్ స్టోరి’ లొకేషన్‌లో శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘లవ్ స్టోరి’. పల్లెటూళ్ల నుంచి సిటీకి వచ్చిన ఆంధ్ర అమ్మాయి, తెలంగాణ అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ సినిమా. నాగ చైతన్య ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడతారు. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే, మంగళవారం దర్శకుడు శేఖర్ కమ్ముల పుట్టినరోజు. ప్రస్తుతం ‘లవ్ స్టోరి’ షూటింగ్‌లో బిజీగా ఉన్న శేఖర్ కమ్ముల తన పుట్టిన రోజు వేడుకలను లొకేషన్‌లోనే జరుపుకున్నారు. యూనిట్ సభ్యుల సమక్షంలో శేఖర్ కమ్ముల పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆయనతో భారీ కేక్‌ను కట్ చేయించారు. ఈ సందర్భంగా హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాత సునీల్ నారంగ్‌లతో పాటు భరత్ నారంగ్, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా తదితరులు దర్శకుడు శేఖర్ కమ్ములకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పవన్ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31oK8fO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...