Saturday, 15 February 2020

నితిన్ నిశ్చితార్థం.. ఫొటోలు షేర్ చేసిన హీరో

యువ కథానాయకుడు నితిన్ ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు షాలిని అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న నితిన్.. మొత్తానికి ఇంట్లోవారిని ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు. ఈరోజు నితిన్ ఇంట్లో నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. నితిన్ తన కాబోయే భార్య ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ‘పెళ్లి పనులు స్టార్టెడ్, మ్యూజిక్ స్టార్ట్స్.. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఏప్రిల్ 15న దుబాయ్‌లోని పలాజో వర్సాచే హోటల్‌లో పెళ్లి వేడుక ఘనంగా జరగనుంది. అయితే నితిన్ షాలినిని 2012లోనే కలిసారట. అయితే అప్పటికి ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంది. READ ALSO: రెండేళ్ల క్రితమే ఇద్దరి స్నేహం ప్రేమగా మారిందట. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటుండడంతో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారట. ఎంతైనా నితిన్ సినిమా హీరో. తన ఆలోచనలు కూడా సినిమాటిక్‌గా ఉంటాయి. అందుకే షాలినికి అందరిలాగా పువ్వులు ఇచ్చి పెళ్లి చేసుకుంటావా అని రొటీన్‌గా అడగలేదట. కాస్త వైరెటీగా ప్రపోజ్ చేయాలని నితిన్ అనుకున్నారట. అందుకే ఒంటికాలిపై నిలబడి ప్రపోజ్ చేసాడట. దాంతో నితిన్ చేష్టలు చూసి నవ్వుకున్న షాలిని వెంటనే అతని ప్రేమను ఒప్పుకున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37vWDHK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...