Thursday, 27 February 2020

మహేష్‌ను బాలీవుడ్‌కు లాగాలని చూస్తున్న బడా నిర్మాత.. ఎంతైనా ఇస్తాడట

సూపర్‌స్టార్ తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇక్కడి హీరోలు బాలీవుడ్‌కి వెళ్తే బాగుంటుందని కొందరి అభిప్రాయం. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ అని ప్రూవ్ చేసేసుకున్నారు. అందుకే ఆయన నటించిన ‘సాహో’ సినిమాను కూడా హిందీలో రిలీజ్ చేసారు. కానీ మహేష్ ప్యాన్ ఇండియా స్టార్ కాదు. కానీ ఆయన గురించి బాలీవుడ్‌లో తెలీని వారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే మహేష్.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి థంప్స్ అప్ యాడ్ చేస్తుంటారు. ప్రకటనల్లో నటించారు కాబట్టి మహేష్ హిందీ సినిమాల్లో నటిస్తే బాగుంటుందని కోరుకోవడంలో తప్పు లేదు. నీ మహేష్‌కు అసలు ఆ ఇంట్రెస్ట్ లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రభాస్, విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లో నటించేందుకు రెడీ అయిపోయారు కానీ మహేష్‌కు మాత్రం ఆ ఆలోచన కూడా లేదు. తాను అస్సలు బాలీవుడ్‌లో నటించాలని అనుకోవడం లేదని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారు. అయితే బాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన సాజిద్ నదియాద్‌వాలా ఎలాగైనా మహేష్‌ను బాలీవుడ్‌లోకి లాగాలని చూస్తున్నారట. ఆయన నిర్మిస్తున్న ఓ మల్టీస్టారర్ సినిమాలో మహేష్‌ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం మహేష్‌కు ఎంతైనా ఇస్తామని కూడా చెప్పినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. READ ALSO: ఈ మల్టీస్టారర్‌లో రణ్వీర్ సింగ్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అన్నది తెలీదు కానీ మహేష్ మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చినా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడు అన్నది మాత్రం కచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే అందరూ అన్ని ఇండస్ట్రీలలో హిట్ అవ్వలేరు. మహేష్ తెలుగులో సూపర్‌స్టార్ అవ్వచ్చు. కానీ ఆయన చరిస్మా బాలీవుడ్‌కు అతకదనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్.. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో పాటు పరశురాంతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారట. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Tkq1ff
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...