Monday, 3 February 2020

చెరువులో తాగుబోతు రమేష్ బ్యాంకాక్ మాసాజ్.. వెన్నెల కిషోర్ వీడియో తీసి వదిలాడు

కమెడియన్ .. సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్స్‌తో పాటు సెట్స్‌లో జరుగుతున్న ఫన్‌కి సంబంధించి ఫొటోలు, వీడియోలను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా తాగబోతు రమేష్‌తో కలిసి షూటింగ్ స్పాట్‌లో చేసిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు వెన్నెల కిషోర్. ఓ చెరువులో దిగడానికి వెళ్తున్న తాగుబోతు రమేష్‌ని.. ‘నువ్ బ్యాంకాక్ మిస్ అవుతున్నావా’? అని అడిగారు.. అవును మిస్ అవుతున్నా అన్నారు .. ‘ఎందుకు మిస్ అవుతున్నావ్ బ్యాంకాక్ అంటే.. ‘అక్కడ మసాజ్ సెంటర్లకు వెళ్తే మసాజ్ చేయించుకోవడం.. కాళ్లు చేపల తొట్టెలో పెడితే చేపలు వచ్చి కాళ్లను పట్టుకోవడం గొప్ప ఎక్స్‌పీరియన్స్‌‌గా ఉంటుంది’ అని చెప్పాడు. See Photo Story: ఈ చెరువులో కూడా అలాంటి ఎక్స్ పీరియన్స్ దొరుకుతుందో లేదో చూద్దాం అని తాగుబోతు రమేష్.. చెరువులో దిగి కాళ్లు పెట్టగా.. చాలా చేపలు వచ్చి అతని కాళ్లు పట్టుకున్నాయి. దీన్ని వీడియో తీసిన వెన్నెల కిషోర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లొకేషన్ ఎక్కడో కాని ఆ చెరువు, చేపలు అదిరిపోయాయి అంటూ నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38VP0M2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...