Thursday, 20 February 2020

వాట్ ఎ సర్‌ప్రైజ్... పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన శిల్పా శెట్టి

బాలీవుడ్ ‘సాగరకన్య’ పండంటి ఆడపిల్లకు తల్లయ్యారు. అయితే పాపను ఆమె నవమాసాలు మోసి కనలేదనుకోండి. సరోగసీ (అద్దె గర్భం) ద్వారా రాజ్‌కుంద్రా, శిల్పా శెట్టి దంపతులు ఆడపిల్లకు తల్లిదండ్రులయ్యారు. శివరాత్రి పర్వదినాన లక్ష్మిదేవి వాళ్లింట్లో అడుగుపెట్టిందనే చెప్పాలి. పాపకు సమీషా అని నామకరణం చేసినట్లు శిల్పా శెట్టి వెల్లడించారు. ఆ పేరుకు అర్థం కూడా వివరించారు. స అంటే సంస్కృతంలో ‘పొందినది’ అని, మీషా అంటే రష్యన్ భాషలో దేవుడితో సమానం అని తెలిపారు. అయితే పాప ఫిబ్రవరి 15న జన్మించిందట. కానీ శివరాత్రి రోజున ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ‘‘ఓం శ్రీ గణేశాయ నమ: మా ప్రార్థనలు ఆ దేవుడు విన్నాడు కాబట్టే మాకు లక్ష్మీదేవిని ప్రసాదించాడు. మా చిట్టితల్లికి మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను’ అని తెలుపుతూ తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసారు. శిల్పా శెట్టి.. ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను 2009 నవంబర్ 22న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే రాజ్‌కుంద్రాకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. కానీ భార్యతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రాజ్‌కి శిల్ప పరిచయం అయ్యారు. ఇద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకోవడంతో పెద్దలు కూడా కాదనలేకపోయారు. READ ALSO: వీరికి వియాన్ అని ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లై, పిల్లాడు పుట్టాక శిల్ప పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే సొంతంగా వ్యాపారాలు కూడా ప్రారంభించి వాటిని చూసుకునేవారు. చాలా కాలం తర్వాత శిల్ప మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమా ‘హంగామా 2’. ఇందులో పరేష్ రావల్, మీజాన్ జాఫ్రే,ప్రణీతా సుభాష్ కీలక పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wsJrGO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...