ఈవెంట్లకు వెళ్లేటప్పుడు సెలబ్రిటీలు ఎంత హడావుడిగా రెడీ అవుతారో అందరికీ తెలిసిందే. ఇక హీరోయిన్ల గురించైతే ప్రత్యే్కంగా చెప్పనక్కర్లేదు. హాలీవుడ్‌లో అయితే మరీనూ. అక్కడ ఎలాంటి దుస్తులు వేసుకున్న పెద్దగా పట్టించుకోరు కాబట్టి ఎక్స్‌పోజింగ్ డోస్ పెంచేస్తారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు జోష్ బ్రోలిన్‌కు క్లాస్ పీకాలని చూశాడు ఓ నెటిజన్. జోష్ తన భార్యతో కలిసి ఓ ఈవెంట్‌కు వెళ్లారు. అతని భార్య వేసుకున్న డ్రెస్ కాస్త అసభ్యకరంగా ఉంది. ముందు భాగంలో ఒళ్లంతా కనపడేలా దుస్తులు వేసుకుంది. ఈ ఫొటోను జోష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఓ నెటిజన్ ఈ ఫొటోపై కామెంట్ చేశాడు. ‘నీ భార్య శరీరాన్ని ఇంటర్నెట్‌లో చూపించాల్సిన అవసరం ఏముంది? దేవుడు ఆడవాళ్లను శరీరమంతా కప్పుకోవాలని చెప్పారు కానీ ఎక్స్‌పోజ్ చేయమని చెప్పలేదు’ అన్నాడు. దాంతో జోష్‌కు ఒళ్లుమండింది. తనదైన శైలిలోనే నెటిజన్ నోరుమూయించాడు. READ ALSO: ‘ఇప్పుడు నేను దేవుడితో మాట్లాడాను. నిన్ను నోరు మూసుకుని స్నానం చేయమని దేవుడు నీతో చెప్పమన్నాడు’ అని రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లైకు దాదాపు పదహారు వేల లైక్స్ వచ్చాయి. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమాలో థానోస్ పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/399zZGv
v
No comments:
Post a Comment