Tuesday, 25 February 2020

ప్రభాస్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. మంచి డైరెక్టర్ చేతిలో పడ్డాడు!

యంగ్ రెబెల్ స్టార్ ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటున్నారు. ఇందుకు కారణం ‘సాహో’ ఇచ్చిన షాకే. ప్రస్తుతం ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న ప్రభాస్ తన తర్వాతి సినిమాను కన్‌ఫర్మ్ చేసేసారు. ‘మహానటి’తో జాతీయ అవార్డును దక్కించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి పనిచేయబోతున్నారు ప్రభాస్. వైజయంతి మూవీస్ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ గుడ్ న్యూస్‌ను ప్రకటించింది. వైజయంతి మూవీ అధినేత అశ్విని దత్ సినిమాను నిర్మించనున్నారు. అయితే సినిమా టైటిల్ ఏంటి? హీరోయిన్ ఎవరు, సహాయ పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు? వంటి వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. చూడబోతే నాగ్ అశ్విన్.. ప్రభాస్ ఇమేజ్ మైండ్‌లో పెట్టుకుని చక్కటి కథనే తయారుచేసుకున్నట్లున్నారు. అందుకే ప్రభాస్‌ కూడా వెంటనే ఓకే చేసేసారు. నాాగ్ అశ్విన్ ఎవరో కాదు. అశ్విని దత్ అల్లుడు. అశ్వినీ దత్ సినిమాలంటేనే భారీ సెట్టింగ్స్‌తో గ్రాండ్‌గా ఉంటాయి. మరి ప్రభాస్‌తో కలిసి నాగ్ అశ్విన్, అశ్విని దత్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో వేచి చూడాలి. READ ALSO: ప్రస్తుతం రాధాకృష్ణ సినిమాతో ప్రభాస్ బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా పూర్తైన వెంటనే నాగ్ అశ్విన్ సినిమాలో నటిస్తారు. రాధాకృష్ణ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘రాధే శ్యాం’, ‘ఓ డియర్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. 1930ల నాటికి చెందిన ప్రేమ కథ నేపథ్యంలో సినిమా ఉండబోతోందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ‘సాహో’ సినిమాతో చేసిన తప్పులు ఈ సినిమాలో రిపీట్ కాకుండా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. See Photo Story: READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2w2Fskj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...