Thursday, 20 February 2020

హీరోలు కూడా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు: హీరోయిన్ కామెంట్స్

హీరోయిన్లు ప్లాస్టక్ సర్జరీలు చేయించుకుంటారు అన్నది వాస్తవమే. ఈ విషయాన్ని ఎందరో హీరోయిన్లు నిర్మొహమాటంగా మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నారు. అయితే, హీరోయిన్లే కాదు హీరోలు కూడా ప్లాస్టిక్ సర్జరీలు, బొటాక్స్‌లు చేయించుకుంటారని అంటున్నారు బాలీవుడ్ నటి . కరీనా కపూర్ హోస్ట్ చేస్తున్న రేడియో షోలో రవీనా పాల్గొన్నారు. ‘‘ఎవరైనా హీరోయిన్ సర్జరీ చేయించుకోగానే మీడియా తెగ ఫోకస్ చేసేస్తుంది. ఆమె సర్జరీ చేయించుకుంది, బొటాక్స్ వేయించకుంది అని రాసేస్తుంటారు. అసలు వీళ్లు ఏమనుకుంటారు? హీరోలు ఇలాంటివి చేయించుకోరు అనుకుంటారా? హీరోలు కూడా సర్జరీలు చేయించుకుంటారు. అలాంటప్పుడు హీరోయిన్ల వైపే ఎందుకు వేలెత్తి చూపుతారు. మన హీరోలు ఎప్పటికీ యవ్వనంగా ఉండటానికి ఏదైనా కనుక్కున్నారా. హీరోయిన్లకు తెలీని పానీయాలు లాంటివి హీరోలు తాగి అందంగా కనిపిస్తున్నారా?" READ ALSO: "అసలు ఏమనుకుంటున్నారు వీళ్లు? అందుకే ఇలా ఆలోచించేవారిని ఉద్దేశించి ఓసారి నేను పంచ్ వేసాను. ‘అందాజ్ అప్నా అప్నా’ సినిమాకు సీక్వెల్ తీస్తే అందులో కూడా హీరోలు సల్మాన్, ఆమిర్ మాత్రమే ఉంటారు కానీ హీరోయిన్లుగా మాత్రం 21 ఏళ్ల వాళ్లని పెడ్తారు అని. అది నిజమే. సినిమా తీస్తే మాత్రం ఓపెనింగ్ సీన్‌లో నాది, కరిష్మాది ఫొటోలు మాత్రం ఉంటాయి. ఆ ఫొటోలకు సల్మాన్, ఆమిర్ దండం పెట్టి యంగ్ హీరోయిన్స్‌తో సినిమా చేస్తారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసారు రవీనా. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bY0kd1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...