లేడీ అమితాబ్ దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సూపర్‌స్టార్ మహేష్ బాబుకి సమానమైన పాత్ర కావడంతో ఆమె ఈ సినిమాకు ఒప్పుకున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి రావాలని ఎదురుచూసిన అభిమానుల కోరిక ఈ చిత్రంతో నెరవేరింది. 13 ఏళ్లు కావొస్తున్నా విజయశాంతి డైలాగ్ డెలివరీలో టైమింగ్‌లో ఏమాత్రం మార్పు లేదు. ఈ విషయం అటుంచితే.. విజయశాంతి చేసిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘సరిలేరు_మీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు. నా నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్,కిలాడి కృష్ణుడు నుండి నేటి 2020 సరిలేరునీకెవ్వరు వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం... మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక సెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు మీ విజయశాంతి. అనిల్ రావిపూడి, మహేష్ బాబుకు ధన్యవాదాలు’ అని ట్వీట్స్ చేశారు. READ ALSO: దీనిని బట్టి చూస్తే ప్రస్తుతం విజయశాంతి సినిమాలు చేసే అవకాశమే లేదని తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రమోషన్స్ సమయంలోనూ విజయశాంతి ఇదే మాటన్నారు. ‘సరిలేరు’ కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి ఒప్పుకున్నానని, తనకు రాజకీయ ప్రయాణమే ముఖ్యమని తెలిపారు. అయితే ఒకవేళ తనను సినిమాల్లో తీసుకోవాలంటే రెండు కండీషన్లకు ఒప్పుకోవాలని విజయశాంతి అన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒకటి హీరోకు సమానమైన పాత్ర ఉండాలని అన్నారట. రెండోది హీరోకు ఇచ్చినంతే పారితోషికం ఇవ్వాలట. ఈ రెండింటికీ ఒప్పుకుంటేనే తాను మున్ముందు సినిమాల్లోనూ నటిస్తానని చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bfJMga
v
No comments:
Post a Comment