Monday, 24 February 2020

రజినీకాంత్ సినిమాకు చిరంజీవి టైటిల్.. తలైవా కూడా వదల్లేదుగా

మన చిత్ర పరిశ్రమల వారానికి ఒక సినిమా మొదలైపోతుంటుంది. అది చిన్న సినిమా అవ్వచ్చు లేదా పెద్ద మూవీ అవ్వచ్చు. సినిమాకు కథ రాసుకోవడం ఒక పెద్ద పనైతే.. ఆ కథకు తగ్గట్టు టైటిల్ పెట్టడం మరో తలనొప్పితో కూడుకున్న పని. ఈ విషయాల్లో ఎంత ఒత్తిడి ఉంటుందో దర్శకులు, నిర్మాతలకు బాగా తెలుసు. అందుకే ఒక్కసారి రిజిస్టర్ చేసుకున్న టైటిల్‌ను మరొకరు వాడేస్తే గొడవలు అయిపోతూ ఉంటాయి. ఇంతకీ ఇప్పుడు విషయం ఏంటంటే.. ఇప్పుడు మరో భారీ సినిమాకు మెగాస్టార్ నటించిన సినిమా టైటిల్ వాడబోతున్నారట. అది ఎవరి సినిమానో కాదు.. సూపర్‌స్టార్ మూవీ. తమిళంలో ఆయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఖుష్బు, మీన కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘అన్నాత్తే’ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేసారు. అయితే రజినీకాంత్ సినిమాలన్నీ తెలుగులోనూ పక్కాగా రిలీజ్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తారు. అయితే సినిమాకు తెలుగు టైటిల్ కూడా ఒకటి అనుకోవాలి. అందుకే సినిమాకు ‘అన్నయ్య’ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారట. తమిళంలో అన్నాత్తు అంటే అన్నయ్య అని అర్థం. అన్నయ్య అనేది మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా. అయితే ఈ టైటిల్ వాడితే మెగాస్టార్ ఫ్యాన్స్ అభ్యంతరం చెప్తారా అనే సందేహం కూడా ఉంది. READ ALSO: రజినీకాంత్ నటించిన సినిమాలకు తెలుగు టైటిల్స్ ఇదివరకు ఎప్పుడూ విన్నట్లు, చూసినట్లు అనిపించదు. ఇప్పుడు చిరంజీవి టైటిల్‌ని వాడితే రజినీకాంత్ ఒప్పుకుంటారో లేదో అన్న టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. గతంలో యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్, నేచురల్ స్టార్ నాని చిరంజీవి సినిమా టైటిల్సే వాడుకున్నారు. బెల్లంకొండ ‘రాక్షసుడు’ అనే సినిమాలో నటించగా, నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38XC6xl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...