Friday, 21 February 2020

అందుకే మెగా వారసురాలికి అవకాశాలు లేవా.. ఎవరైనా నూరిపోస్తున్నారా?

మెగా వారసురాలు కొణిదెలకు సినిమాలు పెద్దగా వర్కవుట్ అవడంలేదు. ఆ కుటుంబం నుంచి వచ్చిన వారు హీరోలుగా బాగానే సెటిల్ అయిపోయారు కానీ నిహారికకు మాత్రం అసలు అవకాశాలే లేకుండాపోయాయి. 2016లో వచ్చిన ‘ఒక మనసు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ‘ఒరు నాల్ల నాల్ పాత్తు సొల్రేన్’ అనే తమిళ సినిమాతో పాటు ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ సినిమాల్లో నటించారు. ఇవేవీ నిహారిక కెరీర్‌ను బూస్ట్ చేయడానికి సాయపడలేకపోయాయి. తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ఒక్క సినిమా లేకుండాపోయింది. దాంతో కాస్త గ్లామర్ డోస్ పెంచి ఫొటోషూట్లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు నిహారిక. తనలో పక్కింటి అమ్మాయి ఇమేజ్ మాత్రమే కాదు హాట్ గ్లామర్ డాల్ కూడా దాగి ఉందని నిరూపించుకున్నారు. అయితే నిహారికకు ఆఫర్లు లేకపోవడంపై ఇండస్ట్రీ నుంచి ఓ రూమర్ వినిపిస్తోంది. నిహారిక మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడంతో ఆమెను సినిమాల్లో తీసుకోవడానికి ఎందుకో భయపడుతున్నారట. కొందరు కొత్త నిర్మాతలు కొత్త హీరోయిన్స్‌ని సినిమాల్లో తీసుకోవాలని నిహారిక ఎంపిక చేసుకోవాలని అనుకున్నారట. కానీ కొందరు ఆ నిర్మాతలకు బ్రెయిన్ వాష్ చేసి వేరే హీరోయిన్ అయితే బెస్ట్ అని చెబుతున్నారట. మొత్తానికి ఆమెను సినిమాల్లో తీసుకుంటే లేని పోని తలనొప్పులు వస్తాయని అనుకుంటున్నారట. READ ALSO: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో ఏ సైడ్ నుంచైనా సమస్య రావచ్చని భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఓ హీరోయిన్‌కి కావాల్సిన లక్షణాలన్నీ నిహారికలో ఉన్నాయి. ఆమెను మెగా వారసురాలిగా కాకుండా మంచి నటిగా భావించి ఎవరైనా ఛాన్స్ ఇస్తే తనలోని స్కి్ల్ ఏంటో నిరూపించుకునే సత్తా ఉంది. మంచి సినిమా చేతిలో పడాలేగానీ అన్న వరుణ్ తేజ్‌ను మంచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2V9hlL6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...