Wednesday, 12 February 2020

నేషనల్ టీవీలో ఆ బూతులేంటి.. నటుడిని ఏకిపారేసిన యాంకర్

సిద్దార్థ్ శుక్లా.. ఇతని గురించి తెలీని వారు ఎవరూ ఉండరు. ‘బాలికా వధు’ సీరియల్‌లో ఇతను కీలక పాత్ర పోషించాడు. ఈ సీరియల్ తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’ పేరుతో ప్రసారమైంది. ఈ సీరియల్‌తో సిద్ధార్థ్‌కు బాగా పేరు వచ్చింది కానీ అవకాశాలు లేకుండా పోయాయి. అందుకే సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 13లో పాల్గొన్నాడు. అయితే తన షార్ట్ టెంపర్‌తో షోలో అసభ్యకరమైన పదజాలం వాడుతున్నాడు సిద్ధార్థ్. తనకు కోపం వచ్చినా బాధ వచ్చినా ఆపుకోలేనని, అందుకే అలా బూతులు మాట్లాడతానని తనని తాను సమర్ధించుకున్నాడు. దీనిపై ప్రముఖ హిందీ యాంకర్ అర్చనా పురాన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘‘ఇలా ఎవరు ప్రవర్తించినా నేను అస్సలు సహించలేను. నేను బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొన్నాను. బిగ్‌బాస్ హౌజ్‌లో దాదాపు వంద రోజులు ఉన్నాను. కానీ నేనుప్పుడూ ఇలాంటి బూతులు వినలేదు. ఎవ్వరి చేత తిట్టించుకోలేదు కూడా. ఎందుకంటే నాతో పాటు ఉన్న మిగతా కంటెస్టెంట్స్‌కి నేషనల్ టీవీలో ఎలా ప్రవర్తించాలో తెలుసు. బాయ్‌ఫ్రెండ్స్ కోపంతో దరిద్రమైన బూతులు మాట్లాడేస్తే ఎంతమంది ఆడపిల్లలు భరిస్తారో నాకైతే అర్థంకాదు. సారీ నన్ను మా ఇంట్లోవాళ్లు మాత్రం అలా పెంచలేదు’ అని గట్టిగా క్లాస్ పీకింది. సిద్ధార్థ్‌పై ఇప్పటికే ఎందరో సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివారిని నేషనల్ టీవీ షోలలో ఎందుకు తీసుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. READ ALSO: తనపై ఇన్ని విమర్శకులు వస్తున్నప్పటికీ సిద్ధార్థ్ తన పద్ధతి మార్చుకోవట్లేదు. నిన్న షోలో పాల్గొన్న రష్మి దేశాయ్ అనే నటిని నోటికొచ్చినట్లు తిట్టాడు. ఆమె నెలకు ఒకరిని మార్చే టైపని, అలాంటి అమ్మాయితో తాను ఉండలేనని అన్నాడు. ‘‘రష్మీతో నేను ఎందుకు గొడవపడుతున్నానని చాలా మంది అడుగుతున్నారు. నేను ఇప్పుడే దీని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఒకప్పుడు నేను రష్మీని చాలా ఇష్టపడ్డ మాట నిజమే. కానీ నేను సెట్స్‌లో ఇతర నటీనటులతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడినని నా గురించి కొన్ని పత్రికలు రాసాయి. అవన్నీ రష్మీకి ఉన్న సమస్యలు. రష్మీనే ఈ సమస్యలన్నింటికీ కారణం అని నాకు ప్రొడక్షన్ బాయ్స్ చెప్పారు. అదీకాకుండా రష్మీ నెలకొకరిని మార్చే టైపు’’ అన్నాడు. దాంతో రష్మీకి కోపం వచ్చి సమయం వచ్చినప్పుడు నేను కూడా నీ గురించి బయటపెడతానని హెచ్చరించింది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2w5W2zy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...