Wednesday, 19 February 2020

విజయ్ ‘మాస్టర్’లో ఎన్టీఆర్ పాట.. దీనిలో ఆయన ప్రమేయం ఉందా?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తోన్న క్రేజీ మూవీ ‘మాస్టర్’. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఇటీవల ‘కుట్టి స్టోరీ’ పాట విడుదలైంది. హీరో స్వయంగా ఈ పాటను ఆలపించడంతో బాగా పాపులారిటీ వచ్చింది. విపరీతంగా ట్రెండ్ అయ్యింది. అయితే, ఈ పాట తెలుగు వర్షన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆలపించనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్‌కు పాటలు పాడటం కొత్తేమీ కాదు. తారక్ మంచి నటుడు, డ్యాన్సర్ మాత్రమే కాదు.. అమేజింగ్ సింగర్ కూడా. ఇప్పటికే ఆయన సినిమాలో స్వయంగా పాడిన పాటలు ఎంతో పాపులర్. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ‘ఐ వాన ఫాలో యు’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘కుట్టి స్టోరీ’ తెలుగు వర్షన్‌ను ఎన్టీఆర్‌తో పాడించాలని దర్శకుడు కనకరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ భావించి ఆ విషయాన్ని విజయ్ వద్దకు తీసుకెళ్లారట. విజయ్‌కు కూడా ఈ నిర్ణయం బాగా నచ్చడంతో ఆయనే స్వయంగా ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారట. ఎన్టీఆర్ కూడా పచ్చజెండా ఊపేశారని సమాచారం. మరో ఇండస్ట్రీకి చెందిన హీరోలకు పాట పాడటం ఎన్టీఆర్‌కు కొత్తేమీ కాదు. గతంలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సినిమాలో ఎన్టీఆర్ పాట పాడారు. Also Read: ఇదిలా ఉంటే, దళపతి విజయ్‌తో ఎన్టీఆర్‌కు మంచి స్నేహం ఉంది. ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, నిర్మాత మహేష్ ఎస్ కోనేరు విజయ్ సినిమా ‘బిగిల్’ను తెలుగులో ‘విజిల్’గా విడుదల చేశారు. ఆ సమయంలో విజయ్, ఎన్టీఆర్‌ల మధ్య మహేష్ వారధిగా వ్యవహరించారు. విజయ్‌కు ఎన్టీఆర్ స్వయంగా ఫోన్‌ చేసి చిత్ర విజయం పట్ల అభినందనలు తెలిపారు. Also Read: ఇప్పుడు ‘మాస్టర్’ తెలుగు రైట్స్ కూడా మహేష్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. కాబట్టి, ‘మాస్టర్’ సినిమాలో ఎన్టీఆర్ పాట పాడటం వెనుక మహేష్ రాయబారం కూడా ఉండే ఉంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. ఏదేమైనా, విజయ్ సినిమాలో ఎన్టీఆర్ పాట పాడటం ఇటు దళపతి అభిమానులతో పాటు అటు యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చే విషయం. చూద్దాం ఈ రూమర్‌లో నిజమెంతుందో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38LI04E
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...