Friday, 7 February 2020

వ్యాలెంటైన్స్ డే ఎఫెక్ట్.. ప్రేమలో పడ్డానంటున్న ఇలియానా

మరో వారంలో వ్యాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. అప్పటివరకు సింగిల్‌గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న వారికి కూడా ఈ వ్యాలెంటైన్స్ అన్న పదం వినగానే ప్రేమలో పడిపోవాలనిపిస్తుంది. గోవా బ్యూటీ ఇలియానాకి కూడా ఈ ఐడియా వచ్చినట్లుంది. అందుకే నేను ప్రమేలో పడ్డానోచ్ అంటూ తెగ సిగ్గుపడిపోతోంది. అయితే ప్రేమలో పడింది అబ్బాయితో అనుకుంటనే మీరు పొరబడినట్లే. ఇల్లూ బేబీ ప్రేమలో పడింది తాను పెంచుకుంటున్న కుక్కతో. ఇటీవల ఇలియానా సైబీరియన్ హస్కీ జాతికి చెందిన కుక్కను తెచ్చుకున్నారు. ఇక రోజంతా దాంతోనే ఆడుకుంటూ గడిపేస్తున్నారు. ఇదివరకు ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో ఉన్నారు. దాదాపు మూడేళ్ల పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకానొక సందర్భంలో పెళ్లి చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇలియానా గర్భం దాల్చిందనీ పుకార్లు వినిపించాయి. దాంతో ఇలియానా ఓ ఇంటివారయ్యారని ఫ్యాన్స్ సంతోషించారు. కానీ వారి సంతోషం ఎన్నో రోజులు లేదు. గతేడాది తాను ఆండ్రూతో విడిపోయానని ఇలియానా ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశారు. READ ALSO: ఎందుకు విడిపోయారో చెప్పలేదు కానీ తనకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ప్రస్తుతానికి ప్రేమ, పెళ్లిళ్లకు దూరంగా ఉండాలని అనుకున్నారట. దీనిని బట్టి చూస్తే ఇప్పుడిప్పుడు ఇలియానా మళ్లీ ప్రేమలో పడే అవకాశాలు కనిపించడంలేదు. అలాగని ఇలియానా చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు. అటు తెలుగులో ఇటు బాలీవుడ్‌లో అవకాశాలు లేక ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతానికి హాట్ హాట్ ఫొటో షూట్లతో పనికానిచేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UwNFHz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...