Saturday, 1 February 2020

అవును, మాజీ భర్తను చిత్రహింసలు పెట్టాను: ఒప్పేసుకున్న స్టార్ నటి

ప్రముఖ హాలీవుడ్ నటులు, దంపతులు , ఆంబర్ హర్డ్‌ల గొడవ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వీరిద్దరి మధ్య కొన్నేళ్లకే విభేదాలు వచ్చాయి. దాంతో విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. అయితే తన భర్త తనను టార్చర్ గొంతు నొక్కి చంపబోయాడని ఆరోపించారు. అంతేకాదు, ఇద్దరి మధ్య జరిగిన కొట్లాటలో డెప్ చేతి వేలికి గాయం అయితే, ఆ రక్తంతో అద్దంపై భయంకరమైనన సందేశాలు రాసేవాడని ఆరోపించారు. ఈ విషయం పక్కన బెడితే.. ఇప్పుడు ఆంబర్ హర్డ్ మరోసారి మీడియా ముందుకు వచ్చి షాకింగ్ విషయాలు వెల్లడించారు. తన భర్తను టార్చర్ పెట్టానని ఒప్పేసుకున్నారు. కుండలు, ఇంట్లోని వంట సామాన్లతో తన భర్తపై దాడి చేశానని వెల్లడించారు. దాంతో జానీ డెప్ 50 మిలియన్ డాలర్లు తనకు ఇవ్వాలంటూ ఆంబర్‌పై పరువు నష్టం దావా వేశారు. అంతేకాదు ఒకప్పుడు ఆంబర్ డెప్‌పై తప్పుడు ఆరోపణలు చేయడంతో ఆయన నటించాల్సిన ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయనపై ఆంబర్ ఆరోపణలే చేయడంతో డిస్నీ సంస్థ ఆయనకు ఫేమస్ జాక్ స్పారో పాత్రను ఇవ్వలేదు. READ ALSO: అయితే ఇప్పుడు డెప్‌పై దాడి చేశానని ఆంబరే మీడియా ముందు ఒప్పుకున్నారు కాబట్టి ఆమెను కూడా సినిమాల్లో తీసుకోకూడదని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ‘ఆక్వామ్యాన్’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతోంది. ఇందులో ఆంబర్ కీలక పాత్రల నటించాల్సి ఉంది. ఈ సినిమాలో ఆంబర్‌ను తీసుకోకూడదని, న్యాయం అనేది సమానంగా ఉండాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UfYOwg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...