Wednesday, 26 February 2020

వీసా కోసం వేచిచూస్తోన్న నాగశౌర్య

యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల ‘అశ్వథ్థామ’తో ప్లాప్ అందుకున్నారు. వరుస డిజాస్టర్లతో డీలా పడిన ఈ హీరో ఒక మంచి విజయంతో కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఇటీవలే ఒక సినిమాను ప్రారంభించారు. అయితే, నాగశౌర్య తన ఆశలను మాత్రం అవసరాల శ్రీనివాస్ సినిమాపై పెట్టుకున్నారు. ఈ సినిమాకు ‘పలానా అబ్బాయి పలానా అమ్మాయి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా పేరు సంపాదించిన నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాతో మరోసారి జతకట్టారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ‘పలానా అబ్బాయి పలానా అమ్మాయి’ సినిమా ఆగిపోయిందని ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. కానీ, ఈ రూమర్లపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఆగిపోలేదని, ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తయిందని స్పష్టం చేశారు. Also Read: ‘‘నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ ప్రాజెక్ట్ 50 శాతం పూర్తయింది. మిగిలిన భాగాన్ని యూఎస్ఏ‌లో షూట్ చేస్తాం. మేం వీసాల కోసం వేచి చూస్తున్నాం. సినిమా చాలా బాగా వస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వస్తోన్న రూమర్లు తప్పు. అవి నిరాధారమైన వార్తలు’’ అని చిత్ర నిర్మాతల్లో ఒకరైన వివేక్ కూచిభొట్ల ట్వీట్ చేశారు. కాగా, ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3a5i58d
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...