మెగాస్టార్ , కింగ్ మరికొంత మంది టాలీవుడ్ పెద్దలు కలిసి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో సోమవారం నాడు భేటీ అయ్యారు. సినీపరిశ్రమ పురోభివృద్ధే ధ్యేయంగా ఈ కీలక భేటీ జరిగింది. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమంపై మంత్రి తలసానిని కలిసి కీలక విషయాలపై చర్చించిన చిరు, నాగ్‌లు మరోసారి భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన కీలక భేటీ జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టుడియోలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోమ్, రెవెన్యూ, న్యాయశాఖ,కార్మిక శాఖ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు మంత్రి తలసాని. ఈ భేటీలో చర్చించిన కీలక అంశాలు ఏంటంటే.. ✦ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాలలో స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిన మంత్రి. ✦ కల్చరల్ సెంటర్, స్కిల్ డవలప్ మెంట్ కేంద్రం కోసం అవసరమైన స్థలాలు సేకరణ. ✦ సినీ, టి వి కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలని ఆదేశం. ✦ సింగిల్ విండో విధానంలో షూటింగ్‌లకు త్వరితగతిన అనుమతులు. ✦ ఎఫ్ డీ సీ ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు. ✦ సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు. ✦ టికెట్ల ధరల సరళీకృత విధానం ✦ సినీపరిశ్రమతో పాటుగా టీవీ కళాకారులకు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు. ✦ వీటితో పాటు సినీ అవార్డుల ప్రధానం, ప్రభుత్వ పథకాలను సినీ కార్మికులకు వర్తింపు, ఈ.ఎస్.ఐ- గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు తదితర ప్రతిపాదనలను తెలియజేశారు సినీపెద్దలు. ఇవన్నీ అమలు అయితే సినీ ఇండస్ట్రీకి, ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు మంచి రోజులే అని చెప్పొచ్చు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SdVlN8
v
No comments:
Post a Comment