Monday, 17 February 2020

Bigg Boss: ఛానెల్ మోసం చేసింది, విన్నర్ అతను కాదు: ఉద్యోగిని షాకింగ్ ఆరోపణలు

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 13లో ఫిక్సింగ్ జరిగిందా? ఈ షోలో ప్రముఖ బుల్లితెర నటుడు సిద్దార్థ్ శుక్లా ట్రోఫీ గెలిచారు. రన్నరప్‌గా ఆసిమ్ రియాజ్ గెలిచాడు. అయితే షోలో సిద్దార్థ్ కంటే ఆసిమ్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయట. కానీ ఫిక్సింగ్ చేసి సిద్దార్థ్‌ను గెలిపించారని నిన్నటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. పైగా షోని ప్రసారం చేసిన కలర్స్ టీవీ‌లో పనిచేసే ఉద్యోగిని కూడా ఫిక్సింగ్ జరిగిందని షాకింగ్ విషయాలు బయటపెట్టడంతో రచ్చ జరుగుతోంది. ఫెరీహా అనే ఉద్యోగిని బిగ్‌బాస్ షోలో ఫిక్సింగ్ జరిగిందని పేర్కొంటూ వివాదాస్పద ట్వీట్ పెట్టింది. ‘‘నేను కలర్స్ టీవీలో ఉద్యోగం మానేసాను. కలర్స్ క్రియేటివ్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఫీలవుతున్నాను. కానీ బిగ్‌బాస్ లాంటి ఫిక్స్‌డ్ షోలో నేను భాగం అయ్యి నా మనసాక్షిని చంపుకోలేను. తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ ఛానెల్ సిద్దార్థ్ శుక్లానే విన్నర్‌ని చేసింది. సారీ.. ఇలాంటి ఛానెల్‌తో కలిసి నేను పనిచేయలేను’ అని ట్వీట్ చేసింది. దీనిపై వెంటనే కలర్స్ టీవీ సంస్థ స్పందించింది. READ ALSO: ‘‘మేం ఓ విషయం క్లారిటీగా చెప్పాలనుంకుంటున్నాం. ఫెరీహా అనే యువతి మా ఛానెల్‌లో పనిచేయలేదు. అసలు ఆ పేరుతో ఏ అమ్మాయీ లేదు. తను మా సంస్థపై చేస్తున్న వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి తల తోక లేని వాళ్లు చెప్పే మాటలు మీరు అస్సలు పట్టించుకోకండి’ అని పేర్కొంది. సల్మాన్ ఖాన్.. సిద్దార్థ్ శుక్లాను విన్నర్ అని ప్రకటించినప్పుడే ఫిక్సింగ్ జరిగిందని చాలా మంది ట్వీట్లు చేసారు. సిద్దార్థ్‌ని ఎలా గెలిపిస్తారు అని సెలబ్రిటీలు కూడా ఆగ్రహం వ్యక్త ంచేసారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HxIYpf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...